ఎవరైనా ఏదో ఈ-మెయిల్ చేసి ఏదైనా సహకారం అడిగితే దాని పూర్వాపరాలు చూడకుండా మేలు చెసేస్తారు భారత విదేశాంగ మంత్రిణి సుష్మా స్వరాజ్‌. అదే విధంగా  ఈ-మెయిల్ చేసి లక్నోలో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌-పోర్టు ఆఫీసు లో గత శనివారం చేదు అనుభవం ఎదురైంది. మహ్మద్‌ అనాస్‌ సిద్దిఖీ  తన్వీ సేథ్‌ దంపతుల పట్ల పాస్‌-పోర్టు సేవా కేంద్రం అధికారి వికాస్‌ మిశ్రా మతపరమైన వ్యాఖ్యలు చేశాడని సదరు జంట సుష్మా స్వరాజ్‌ కు ట్వీట్‌ చేయడంతో ఆమె స్పందించారు.
Related image
హుటా హుటిన చర్యలు ప్రారంభించి వికాస్‌ మిశ్రాను గోరఖ్‌పూర్‌ బదిలీ చేశారు. సిద్దిఖీ-తన్వీ జంటకు వెంటనే పాస్‌-పోర్టు జారీ చేయించారు. అయితే, సిద్దిఖీ-తన్వీ సమర్పించిన డిక్లరేషన్‌ వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని ఇంటలిజెన్స్‌ వర్గాల వెరిఫికేషన్‌లో బయటపడింది. 


లక్నోలో పాస్‌-పోర్టు సేవాకేంద్రం ఉదంతం తాలూకూ ట్వీట్లు, కామెంట్లు, విమర్శల పరంపర ఆగడం లేదు. పాస్‌-పోర్టు కార్యాలయ అధికారిని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ బదిలీ చేయడంతో ఆమెపై రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. 




సంఘ్‌ పరివార్‌ కార్యకర్తలు సైతం ఆమె పై సోషల్‌ మీడియాలో విమర్శలు గుప్పించారు. తాజాగా, సుష్మా స్వరాజ్‌ భర్త స్వరాజ్‌ కౌషల్‌ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ ఢిల్లీ ఐఐటీకి చెందిన ముఖేష్‌ గుప్తా చేసిన ట్వీట్‌ చర్చానీయాంశమైంది. "ముస్లింలను బుజ్జగించేందుకు మీ ఆవిడ చాలా కష్టపడుతోంది. ఇంటికి వచ్చాక ఆమెకు నాలుగు తగిలించండి. మీరెన్ని ప్రయత్నాలు చేసినా ముస్లింలు బీజేపీకి ఓటు వేయరని చెప్పండి" అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Image result for sushma swaraj muslim appeasement

దీంతో సుష్మ స్వరాజ్ అత్యుత్సాహం ఒక అధికారి అవమానకర బదిలీకి దారి తీసినట్లే. ఒకరి ఆహం మీద అనవసరంగా దెబ్బకొట్టిన వారెంతటి వారికైనా క్షమార్హులు కూడా కాదు. వారెంతటి ఉన్నత స్థానంలో ఉన్నా సరే అంటున్నారు జనం.

Image result for tweet by mukhesh gupta to sushma swaraj

మరింత సమాచారం తెలుసుకోండి: