చంద్ర బాబు నెల్లూరు లో తలపెట్టిన దళిత తేజం ప్రోగ్రాం అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పవచ్చు. స్వయంగా ఏపీ సీఎం వచ్చిన జనాలు లేక సభ అంతా ఖాళీగా కనిపించింది. దీనితో టీడీపీ కి భంగ పాటు తప్పలేదు. అయితే నెల్లూరు లో టీడీపీ ప్రాబల్యం అంతంతమాత్రం. ఈ జిల్లా వైసీపీ కి కంచుకోట అని చెప్పవచ్చు.అలాంటిది టీడీపీ వారు సభ నిర్వహిస్తే జనాలు రావడమనేది కొంచెం కష్టమైన పని. 

Image result for chandrababu naidu

ఇక చంద్రబాబు ప్రసంగం విషయానికొస్తే.. వైఎస్ఆర్ హయాంలో దళితులకు జరిగిన ఉపకారాలను తన గొప్పలుగా ప్రకటించుకున్నారు బాబు. ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ తో దళితులకు దైవంగా మారారు వైఎస్ఆర్. నిధులు పక్కదారి పట్టకుండా ఆయన కట్టడి చేయడం వల్లే నేడు ఎన్నో వేల దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు, బోర్లు పడ్డాయి. వాటన్నింటినీ తన ఖాతాలో వేసుకున్నారు బాబు.

Image result for chandrababu naidu

పనిలో పనిగా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దళితులకు ప్రత్యేక వరాలను కూడా ఇదే వేదికపై నుంచి గుప్పించారు. ఇంటి నిర్మాణ సబ్సిడీ, ఇళ్ల స్థలాలు, ఉచిత కరెంట్ అంటూ ఏవేవో వాగ్దానాలు చేశారు. అయితే చాలా సందర్భాల్లో చంద్రబాబు ప్రసంగానికి పెద్దగా స్పందన రాలేదు. దీంతో బాబే ప్రాధేయపడి మరీ "గట్టిగా చప్పట్లు" అంటూ అందరితో కొట్టించుకున్నారు. నాకు మద్దతివ్వండి, నాకు మద్దతివ్వండి అంటూ పదే పదే ప్రాథేయపడ్డారు. చప్పట్లతో మీ సంఘీభావం తెలపండి అంటూ బతిమిలాడుకున్నారు. మొత్తమ్మీద నెల్లూరులో జరిగిన దళిత తేజం సభ టీడీపీకి ఏమాత్రం లాభం చేకూర్చకపోగా.. మరోసారి చంద్రబాబు అందరి ముందు అభాసుపాలయ్యేలా చేసింది. హామీలతో వల వేసే బాబు బుద్ధిని మరోసారి బైటపెట్టింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: