"ఆ రోజు నేనువచ్చా! చంద్రబాబు సైతం పిట్టల దొరలా వచ్చాడు. జూన్‌ తొలివారం లోనే నీళ్లు అందిస్తానని హామీ ఇచ్చాడు. ఈ నాలుగేళ్ల లో ఒక్కసారైనా నీళ్లు అందయా?" అని ఆయన సూటిగా అడిగారు. జూన్‌ మాసం దేవుడేరుగు, మళ్లీ నవంబర్‌ వస్తుంది, నారుమళ్లు వేస్తున్న కాలంలో రైతన్న మళ్లీ భయపడుతున్నాడని ఆందోళన వ్యక్త పరిచారు. 
Image result for jagan praja sankalpa yatra comments on polavaram
పోలవరం పనులు నత్తనడకగా సాగుతున్నాయని,  డెల్టా కాలువ పనులు ఆగిపోయాయని, ఏ పనికూడా ఒక్క అడగుకూడ ముందుకు వెళ్లని పరిస్థితుల్లో తూర్పుగోదావరి జిల్లా ఉందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు  రైతులంతా గతంలో క్రాప్‌-హాలిడే-డిక్లేర్‌ చేశారని, నవంబర్‌ వచ్చేసరికి ఈ ప్రాంతంలో వరుసగా తుఫానులువస్తాయని, తుఫానులతో చేతికొచ్చిన పంట నీటిమయమమ్యే అవకాశం ఉందని, జూన్‌ తొలి మాసం లోనే పొలాలకు నీరందించాలని, క్రాప్‌-హాలిడే ను డిక్లేర్‌ చేశారని అన్నారు. 
Image result for jagan praja sankalpa yatra comments on polavaram
ఈ ప్రాంతంలో పెట్రోలియం వనరులు పుష్కలంగా ఉన్నా ఇక్కడి యువతకు ఉద్యోగాలు లభించడం లేదని ఆయన అన్నారు. చమురు, గ్యాస్‌ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడి ప్రజలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు అని అన్నారు. ప్రజా సంకల్పయాత్ర 201వ రోజు పాదయాత్రలో భాగంగా ముమ్మిడివరం హైస్కూల్‌ సెంటర్‌ వద్ద నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. జీవనది గోదావరి ప్రవహించే పైడిపంటల పచ్చనేల కోనసీమ. అయినా అల్లుడి నోట్లా శనిలా తాగు నీరు ఉండదని, కోనసీమ ముఖ చిత్రం ఇలా ఉంటే, చంద్రబాబు దోపిడీ మాత్రం గేదలలంకే వరకు విస్తరించిందని ఆయనఅన్నారు.  అదే గ్రామంలో ఈ దోపిడిని అడ్డుకున్న మహిళలు, యువకులపై అనేక కేసులు పెట్టారని ఆయన అన్నారు. 
Image result for jagan praja sankalpa yatra 201 day comments on polavaram
ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సంజీవిని అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రత్యేక ప్యాకేజీ అడిగారని, అప్పుడు విభజన చట్టంలోని హామీలు ఏమిగుర్తుకు రాలేదని, కానీ ఈ మధ్య లో ధర్మపోరాటం అని, కాకినాడలో ఆశ్చర్యం కలిగించే మాటలు చెప్పాడని జగన్ అన్నారు. 
Related image
బాబు గారి దొంగ వేషాలు - కొంగ జపాలు 


బీజేపీతో కలిసి ఉన్నన్ని రోజులు ఏ విషయమూ మాట్లాడని చంద్రబాబు, ప్రతిసారి బిజెపి మన రాష్ట్రానికి చేసినంత మేలు మరే రాష్ట్రానికి చేయలేదని చెప్పి నాలుగేళ్లు దాటి ఎన్నికలు గుర్తొచ్చేసరికి "టంగ్-ట్విష్ట్" చేసి కేంద్రంపై అవాకులు చవాక్లు ప్రేలుతూ మళ్ళా ప్రత్యేక హోదా స్లోగన్ అందుకొని -  కొత్తగా 25 మంది ఎంపీలను గెలిపించి ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాన ని అంటున్నారని ఆయన అన్నారు.  ఇప్పుడు 25మందిలో 20మంది ఎంపీలు చంద్రబాబువద్దే ఉన్నారని ఏమైనా ఇప్పుడైనా చేయ గలిగేది ఉంటే చేయకుండా - ఇంత మంది ఎంపీలతో నాలుగేళ్లుగా ఆయన గాడిదలు కాస్తున్నారా? ఆయన అడిగారు.

Image result for jagan praja sankalpa yatra 201 day comments on polavaram

మరింత సమాచారం తెలుసుకోండి: