Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 7:20 am IST

Menu &Sections

Search

2019 ఎన్నికల సమరం - నరెంద్ర మోడీ బిజెపి Vs బిజెపి వ్యతిరేఖ పార్టీలు

2019 ఎన్నికల సమరం - నరెంద్ర మోడీ బిజెపి Vs  బిజెపి వ్యతిరేఖ పార్టీలు
2019 ఎన్నికల సమరం - నరెంద్ర మోడీ బిజెపి Vs బిజెపి వ్యతిరేఖ పార్టీలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మనదేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ  వారసత్వ రాజకీయాలు, వ్యక్తి ఆధారిత, నియంతృత్వ పార్టీలు. లౌకికమనే ముసుగువేసుకొని ఓట్ల కోసం మైనారిటీలను, ప్రయోజనా ల వాగ్ధానాలు చేస్తూ ఇతర మెజారిటీని మభ్యపెట్టి, ఎన్నికలైన తరవాత అధికారంలోకి వచ్చాక, ఎన్నికలముందు చేసిన వాగ్ధానాలు వదిలేసి, ప్రయోజనాలన్నీ తన కుటుంబానికి ఇంకా అవసరమైతే తమ కులానికి, ప్రాంతానికి, వ్యాపార బాగస్వాములకు పంచేసి తమలోని అసలు రంగులను బయట పెట్టుకున్నాయి. 
national-news-modi-vs-all-bjp-versus-anti-bjp-2019
జస్ట్ మొన్న ఈ  కుల సమారాధకుల విన్యాసాలు మనం బెంగళూరులో చూశాం కదా! వాళ్ళంతా రాష్ట్ర వైరుద్యాలు అవసరాలు విభేదాలు చూసుకోకుండా రాసుకు పూసుకు తిరిగి మురిసి పోయాయి కదా!  కాంగ్రెస్ శ్రేణులు వారి జీవితకాలం మొత్తం ఒకే ఒక కుటుంబ సేవనం, ఆరాధనం లోనే కాకుండా, పాదపద్మాల కడ జీవితం మొత్తం గడిపే స్తున్నాయి. ఇప్పుడు బిజెపి వ్యతిరేఖతతో చంద్రబాబు, కెసిఆర్, నవీన్, స్టాలిన్, అఖిలేష్, మాయా, అరవింద్, నుండి నితీష్ కుమార్ వరకు దిగజారి మరుగుజ్జు కాంగ్రెస్ చెంత కాలం వెళ్ళ బుచ్చే స్థాయికి పడిపోయారు.      
national-news-modi-vs-all-bjp-versus-anti-bjp-2019
అయితే నరెంద్ర మోదీ ఫోబియా – వీరందరి సైద్దాంతిక సరిహద్దుల్ని చెరిపేసింది. రాజకీయ అవకాశవాదం అనే ఒకే ఒక సిద్ధాంతం వీరందరిని కలిపింది ఒకటి చేసింది.
దేశంలో పోరాటం ఇప్పుడు బీజేపీ వర్సెస్ యాంటీ బీజేపీ మాత్రమే. గతంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలకునే వారికి ఎంపికలకు కొన్ని అవకాసాలు (ఆప్షన్స్) కూడా ఉన్నాయి.
national-news-modi-vs-all-bjp-versus-anti-bjp-2019

జాతీయ పార్టీలైన బీజేపీ, సీపీఎం, సీపీఐ & ప్రాంతీయ పార్టీలు టీడీపీ, టీఆరెస్, తృణమూల్, ఎస్పీ, బీఎస్పీ, ఆర్జీడీ, జేడీఎస్, అన్నాడీఎంకే, డీఎంకే, లాంటి ద్రవిడ పార్టీలు వైసీపీ, రంగంలో ఉండేవి. కానీ ఇప్పుడు అధికార బీజేపీని వద్దనుకునే వారు ఈ పార్టీల్లో ఎవరికి ఓటు వేసినా సరిపోతుంది. ఇప్పడు రెండే ఆప్షన్స్ మిగిలాయి, బీజేపీ లేదా ఇతరులకు. ఎందుకంటే కాంగ్రెస్ కూరలో కరివేపాకే అంటే దీని స్థాయి ప్రాంతీయ పార్టీకి ఎక్కువ (నేషణల్ ప్రెజన్స్ వలన) ప్రాంతీయ పార్టీ కంటే తక్కువ (ఈ ఒక్క రాష్ట్రంలో అధికారంలో లేకపోవటం – హర్యానా లో అధికారంలో ఉన్నా అది బహు చిన రాష్ట్రం)  
national-news-modi-vs-all-bjp-versus-anti-bjp-2019
ఒకప్పుడు అవినీతి, అసమర్థ, వంశపారంపర్య, ప్రజాస్వామ్య వ్యతిరెఖ పాలనకు మారు పేరైన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమై కూటములు ఏర్పాటు చేసి ఎన్నికలను ఎదుర్కొనేవి.  ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. ప్రాంతీయ పార్టీలన్నీ కూడా అవినీతి, అసమర్థ, వంశపారంపర్య, ప్రజాస్వామ్య వ్యతిరెఖ పాలనకు వేదికలవటం తో వీటికి కాంగ్రేసుకు వీటికి సిద్ధాంతరీత్యా సరిహద్దులు చెరిగిపోయాయి. నిన్న మొన్నటి దాకా వద్దు అనుకున్న కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు వారికి ముద్దు అయిపోయింది. బీజేపీ నేతృత్వం  లోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో ప్రాంతీయ పార్టీలు చేతులు కలపబోతున్నాయి. 


బెంగళూరులో కర్ణాటక ప్రజల అభిమతానికి విరుద్దంగా ఏర్పాటైన కుమారస్వామి కుల స్వామ్య (ఒక్కళిగ) పదవీ వ్యామోహ (కాంగ్రెస్ బిజెపిని పదవి లోకి రాకుండా చేయటానికి మాత్రమే తనను తానే అమ్మెసుకుంది)  ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం ఇందుకు వేదికైంది. 

national-news-modi-vs-all-bjp-versus-anti-bjp-2019
ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ - జేడీఎస్ ను పాదపద్మాలను  కళ్ళతో అద్దుకుని దిగజారి తిరిగి అధికారంలోకి రావడం వీరికి అభ్యంతరకరం అనిపించలేదు. కన్నడ ప్రజలు అత్యధిక సీట్లు కట్టబెట్టిన బీజేపీకి కొన్ని సీట్లు తగ్గాయనే సాంకేతిక కారణాలతో బిజెపి ప్రభుత్వాన్ని అడ్డుకొని అపవిత్ర బంధానికి అక్షింతలు వేశారు. ఎన్టీరామారావు తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగుదేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తమతో సైద్ధాంతిక విభేదమున్నా విరుద్దమైన పార్టీ అయినా తెలుగువారి ఆత్మగౌరవం వదిలేసి సిగ్గూ ఎగ్గూ లేకుండా కాంగ్రెస్ పంచన చేరడానికి సిద్ధమై  అయిపోయారు. 
national-news-modi-vs-all-bjp-versus-anti-bjp-2019
రాహుల్ గాంధీతో చేతులు కలిపి, ఆయన భుజాలు తట్టి ఆ వేదికపైనే చంద్రబాబు తనదైన శైలిలో స్పష్టమైన సంకేతం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల్లో రెండు చోట్లా టీడీపీ, కాంగ్రెస్ మిత్రబంధాన్ని (అలయన్స్) మనం చూడబోతున్నాం అన్నమాట. ఇక తెలంగాణలో అధికార టీఆరెస్ కు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్.
national-news-modi-vs-all-bjp-versus-anti-bjp-2019
అందువల్లనే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయపార్టీల వేదికను ఏర్పాటు చేస్తున్నకేసీఆర్ తమ ఫ్రంట్ లో భాగస్వామి అయిన జేడీఎస్, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని స్వాగతించారు. దీన్ని ప్రాంతీయపార్టీల విజయంగా అభివర్ణించి అటు మమత బెనర్జి, నవీన్ పట్నాయక్, స్టాలిన్, అఖిలేష్, లలూ, శరద్ యాదవులు - ఇటు చంద్రబాబు, నితిష్ కుమార్ లు వారి నేతృత్వంలోని ప్రాంతీయపార్టీలు సమర్ధిస్తున్నారు. 
national-news-modi-vs-all-bjp-versus-anti-bjp-2019
అయితే జెడిఎస్ కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్లకుండా ముందు రోజే బెంగళూరు వెళ్లి అభినందించివచ్చారు కేసిఆర్. ఆయన ఎన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నా ఫెడరల్ ఫ్రంట్, కాంగ్రెస్ ఒకే జట్టులోని భాగస్వాములు అనే సంకేతం తెలంగాణ ప్రజలకు అందింది. బీజేపీని ఉత్తరాదిపార్టీగా నిందించిన వారికి సోనియా, రాహుల్, మమత, మాయ, లాలూ అఖిలేశ్, ఏప్రాంతంవారో? ఎక్కడి వారో? కనిపించడం లేదు. దక్షిణాదిన బీజేపీ ప్రభుత్వాలు లేకపోవచ్చు.  కానీ అన్నా- డీఎంకే, వైసిపి,  రజనీ కాంతో మరొకరో దొరకకపోరు.  వీరే  బీజేపీ శాసనసభ్యులు గానో మరోలాగానో దక్షిణ భారతదేశంలో ఉన్నారనే విషయం మరువరాదు.
national-news-modi-vs-all-bjp-versus-anti-bjp-2019
అయితే ఈ ప్రాంతీయ పార్టీలకు వారి రాష్ట్రాల్లో గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదు. వీరి తీరుపై ఆయా రాష్ట్రాలు ప్రజలు ఇప్పటికే ఇప్పటికే విసుగెత్తి ఉన్నారు కారణం వీరి కులసామాజిక వర్గాలు, ఒక్కో నాయకుని కుటుంబంలోని వారసుల మద్య విభేదాలు అవి చాలవా? అమిత్ షా లాంటి వారి ఆటలకి. వీరు చిన్న కంతలని లేదా రంద్రాలని సొరంగాలు చేయగల సమర్ధులు.
 national-news-modi-vs-all-bjp-versus-anti-bjp-2019కాబట్టి 2019 “బీజేపీ వర్సెస్ యాంటీ బీజేపీ” ఎన్నికల సమర సంవత్సరం అనేది సుస్పష్టం. 
national-news-modi-vs-all-bjp-versus-anti-bjp-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రియాంక రాజకీయ ప్రవెశం పై నరేంద్ర మోడీ వ్యాఖ్యలు షాకింగ్!
ప్రియాంక గాంధి వాద్రాని రాజకీయాల్లోకి తెస్తూ కాంగ్రెస్ తన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించినట్లేనా? ప్రశాంత్ కిషొర్ షాకింగ్ కామెంట్
భారత రాజ్యాంగం ఓరిజినల్ ఎక్కడ ఉందో తెలుసా?
రాజకీయాల్లో రూటు మార్చిన వైఎస్ జగన్? మున్ముందు బాబుకు దెబ్బే!
"దగా! దగా! కుట్ర" పాటపై పిఠాపురంఎమెల్యే ప్రజా ప్రయోజన వ్యాజ్యం - 3 వారాలకు వాయిదా: హైకోర్ట్
డేరింగ్ & డాషింగ్ లో మహెష్ బాబు కృష్ణతో పోటీ పడలేడా!
టిడిపి కొంప ముంచనున్న చంద్రబాబు తుగ్లక్ నిర్ణయం! 20% ఓట్లు గల్లంతు
ట్రంప్ హయాంలో సైతం రెపరెపలాడుతున్న భారత యువత కీర్తి పతాకం
బాన పొట్టను తేలికగా తగ్గించుకోండి ఇలా?
చంద్రబాబు దర్శకత్వంలో ఏర్పడ్డ  'కర్ణాటక సంకీర్ణం'  చట్టు బండలు కానుందా?
ఏపి ప్రభుత్వానికి హైకోర్ట్ ఝలక్ - కొడి కత్తి కేసు విచారణకు "స్టే కి నో"
చంద్రనీతులు పట్టుకొని ఒక పత్రిక చక్కభజన - నిజమేంటి?
అభివృద్ధికి ఆయనే అడ్డంకి - హస్తినలో వాగ్ధానకర్ణుడుపై పేలుతున్నసెటైర్లు
నిర్ణయం పవన్ కళ్యాన్ దే! పొత్తుకు చంద్రబాబు రడీ!
రాజాసింగ్ ఒక్కడు చాలు! కేసీఆరును ఉప్పెనలా చుట్టేయటానికి?
మోడీకి పతనం మొదలైంది 'కోల్‌కతా యునైటెడ్ ఇండియా బ్రిగేడ్' లో చంద్రబాబు
చంద్రబాబుపై తలసాని చండ్ర నిప్పులు? బాబుపై సమర శంఖమేనా?
మహాకూటమి - మోడీకి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలదా?
“15 నిమిషాలు ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తాం!” అన్న వారిని పూచికపుల్లలా తీసేసిన రాజాసింగ్
హత విధీ! అపర చాణక్యుడికిదేం గతి? ఆయన చివరి రోజులే ఈయనకు సంప్రాప్తమౌతున్నాయా?
About the author