ఏపీలో ప్రతిష్టాత్మకమైన విశాఖ పార్లమెంట్ సీటుకు ప్రధాన పార్టీల నుంచి క్యాండిడేట్లు ఫిక్స్ అయినట్లేనా. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపధ్యంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ అభ్యర్ధుల వేటలో బిజీగా ఉన్నాయి. ఈ మధ్యనే వైసీపీ విశాఖ పార్లమెంట్ కన్వీనర్ గా రియల్టర్ ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణను నియమించింది.   విశాఖలో బిల్డర్ గానే కాకుండా కొన్ని సినిమాలు నిర్మించిన నిర్మాతగా కూడా ఆయన పాపులర్. నూటికి నూరు శాతం ఆయనే వైసీపీ ఎంపీ అభ్యర్ధి అంటోంది ఆ పార్టీ.


మూర్తి మనవడుగా అరంగేట్రం :


టీడీపీ విషయానికి వస్తే మాజీ ఎంపీ, గీతం విద్యా సంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి మనవడు, సినిమా నటుడు బాలక్రిష్ణ చిన్న అల్లుడు భరత్ ను విశాఖ బరి నుంచి ఎంపీ క్యాండిడేట్ గా దించుతారని లేటేస్ట్ గా టాక్ నడుస్తోంది. మూర్తి  కేరాఫ్ అడ్రస్ గా మనవడు విశాఖ వాసి అయిపోయారని, సొ లోకల్ నే మేము పోటీ పెడుతున్నామని టీడీపీ అపుడే ప్రచారం చేసుకుంటోంది.


బాలయ్య సినీ గ్లామర్ అండ :


సినీ, పొలిటికల్ గ్లామర్ మిక్స్ చేసి మరీ రంగంలోకి దిగుతున్న టీడీపీ ఎంపీ సీటు గ్యారంటీగా గెలిచేస్తామంటోంది.  చిన్నల్లుడు  భరత్ కు అటు మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మనవడిగా (కూతురు కొడుకు), ఇటు మూర్తి వారసునిగా (కొడుకు రామారావు కొడుకు) బ్రహ్మాండమైన రాజకీయ బాక్ డ్రాప్ కలసి వస్తుందని అంచనాలు వేస్తున్నారు. దీనికి తోడు వెండితెర సీనియర్ హీరో నందమూరి బాలక్రిష్ణ అల్లుడిగా సినిమా ఇమేజ్ ని కూడా వాడేసుకుంటే సక్సెస్ నల్లేరు మీద నడకేనని టీడీపీ సంబర పడుతోంది.


టిక్కెట్ ష్యూరేనట :


సీయం చంద్రబాబు చుట్టం, టీడీపీలో పెద్ద తలకాయ మూర్తి రంగంలోకి దిగాక భరత్ కి టిక్కెట్ ష్యూర్ అనే మాట వినిపిస్తోంది. పైగా బలయ్య కూడా చిన్నల్లుడి పొలిటికల్ ఎంట్రీపై బాగా ఇంటెరెస్ట్ గా ఉన్నట్లు టాక్. మొత్తానికి వైజాగ్ సీటుకి పందెం కోళ్ళు రెడీ అన్న మాట.
 


మరింత సమాచారం తెలుసుకోండి: