లోకేష్ ఆంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి. అన్నిటికీ మించి సీఎం తనయుడు అయితే లోకేష్ స్పీచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఎటువంటి స్పీచ్ అయినా తన దైన శైలిలో మాట్లాడి ప్రజలందరినీ నవ్విస్తాడు. ఎదో ఒక సారి అనుకుంటే పొరపాటు అనుకుంటే సరే మరీ ప్రతి సారి ఇలా మాట్లాడి లోకేష్ నవ్వుల పాలవుతున్నాడు. ఒక పక్క చంద్ర బాబు నాయడు లోకేష్ ను సీఎం స్థానం లో కూర్చో పెట్టాలనుకుంటే, ఈ స్పీచ్ వినీ చంద్ర బాబే భయపడుతున్నాడు. 

Image result for lokesh

ఇప్పటికే జలీల్ ఖాన్ బాగా ఫేమస్ అయ్యాడు.  బహుశా... తన ప్రసంగాలతో ప్రజలకు బాగా వినోదాన్ని పంచిన నేతల్లో లోకేష్ కు సాటి పోటీ ఎవరూ లేరు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, బీకామ్ లో పిజిక్స్ జలీల్ ఖాన్లు కూడా లోకేష్ తర్వాతే. ఎందుకంటే.. కామెడీలో కేఏ పాల్ ది ప్రత్యేకమైన జోనర్. ప్రపంచంలోని రాజకీయాలను తన ఆశీర్వాదాలతో శాసిస్తున్నట్టుగా అతడు చెప్పుకున్నాడు. ఆ వీడియోలు నేటికీ వైరల్.

Image result for lokesh

ఏదో ఒకసారి అయితే తడబాటు అనుకోవచ్చు, రెండో సారి అయితే పొరపాటు అనకోవచ్చు. అయితే లోకేష్ కు మాత్రం ఇదంతా అలవాటు అయిపోయింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది కాకినాడ సభలో కామెడీ. ఫేస్ బుక్‌లో, వాట్సాప్ లో ఇప్పుడు దీని గురించినే చర్చ. అక్కడ లోకేష్ పలుకులు కడుపుబ్బా నవిస్తున్నాయి. లోకేష్ నేర్చుకునేది లేదు, మారేదీ లేదు అని పూర్తిగా స్పష్టత వచ్చిందిప్పుడు. ఇండియా నుంచి బయటకు వచ్చాం.. అని లోకేష్ అంటే, ఇదేంటబ్బా అని అంతా తలలు పట్టుకున్నారు. అయితే అది ఇండియా కాదు, ఎన్డీయే అని తెలిశాకా మాత్రం.. లోకేష్ నవ్వించాడని మెచ్చుకోకమానరు. 


మరింత సమాచారం తెలుసుకోండి: