టీడీపీ అధికారం పూర్తి చేసుకొని నాలుగేళ్లు దాటిపోయింది. 2019 లో ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి అయితే టీడీపీ లో ఉంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ కి గుదిబండలా తయా రయ్యారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాటలు. అస్సలు వీరికి ఈ సారి టికెట్స్ ఇస్తే మొదటికే మోసం వస్తుందని బాబు భయపడుతున్నాడు. అందుకే వీరి బదులు వేరే వారికీ టికెట్స్ ఇచ్చే పనిలో చంద్ర బాబు ఉన్నాడు. 

Image result for chandra babu

కొత్తవాళ్లకు కావాలంటే టికెట్లు ఇవ్వడానికి కూడా తను వెనుకాడను అని కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్నారు. ఇదే జరగబోతోందని.. చాలామంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వచ్చేసారి టికెట్లు దక్కే అవకాశం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. రాయలసీమలో ఈ పరిస్థితి ఉండబోతోందని చాన్నాళ్లుగానే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? సాధారణంగా ఒకసారి ఎమ్మెల్యే పదవిని అనుభవించిన వాళ్లు రెండోసారి దాన్ని నిలబెట్టుకోవడం కష్టంకాదేమో అనుకుంటాం. చేతిలో అధికారం ఉండటం, ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉండటం.. మళ్లీవాళ్లను గెలిపించాలి.

Image result for chandra babu

ప్రత్యేకించి అధికార పార్టీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉండటం అంటే అంతకు మించిన వరంలేదు. వ్యక్తిగతంగా పేరు తెచ్చుకోవచ్చు. పార్టీకి మంచిపేరు తెచ్చి పెట్టవచ్చు. మరోసారి గెలుపుకు బాటలు వేసుకోవచ్చు. అయితే ఎన్నికలయ్యాకా నాలుగేళ్లకు, ఎన్నికలు మళ్లీ దగ్గరపడుతున్న వేళ టీడీపీ సిట్టింగులు మాత్రం బాగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని స్పష్టం అవుతోంది. రాయలసీమ వరకూ తీసుకొంటే.. సగంమంది సిట్టింగులకు టికెట్లు ఇవ్వడం బాబుకే ఇష్టంలేదని, వీరి స్థానాల్లో వేరే వారిచేత పోటీచేయించడానికి బాబు ఆసక్తితో ఉన్నారని స్పష్టం అవుతోంది. తెలుగుదేశం అంతర్గత వర్గాల్లో కూడా ఈ ప్రచారం సాగుతోంది. టీడీపీకి సీమలో ఎక్కువ సీట్లు ఇచ్చిన అనంతపురంలోనే సగంమంది సిట్టింగులకు బాబు నో చెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: