బుల్లితెరపై ఇప్పుడు బిగ్ బాస్ 2 సీజన్ నడుస్తుంది. నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 లో పదమూడు మంది సెలబ్రెటీలు కాగా..ముగ్గురు కామన్ మాన్ తరుపు నుంచి వచ్చారు. వారు మోడల్ సంజన, నూతన్ నాయుడు, గణేష్. బిగ్ బాస్ లో మొదటి రోజే సంజన, నూతన్ నాయుడు లకు జైలు శిక్ష పడింది. దాంతో సంజన సెలబ్రెటీలపై విరుచుకు పడింది..కామన్ మాన్స్ అన్న కారణంతోనే తమకు ఈ శిక్ష విధిస్తారా అంటూ రుసు రుసలాడింది. ఇక బిగ్ బాస్ మొదటి ఎలిమినేషన్ సంజన కావడం మరో విశేషం.
ఆ తర్వాత రెండో ఎలిమినేషన్ లో నూతన నాయుడు అయ్యారు. దాంతో బిగ్ బాస్ 2 పై విమర్శలు రావడం మొదలయ్యాయి. కామన్ మాన్ అన్న కారణంతో ఒక్కొక్కర్ని కావాలనే నామినేషన్ చేస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉంటే రెండో ఎలిమినేషన్ లోకి వెళ్లిన నూతన నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ కి మంచి పరిచయస్తుడని వార్తలు వచ్చాయి.