ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికలలో అసెంబ్లీకి పార్లమెంటు స్థానాలకు పోటీ చేయడానికి రెడీ అవుతున్నారట. 2014 ఎన్నికలలో కొద్దిపాటి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని తీవ్ర అవినీతి పాలు చేయడంతో ప్రస్తుతం ప్రజలలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది అని అనటంలో సందేహం లేదు..ఇందుమూలంగా వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర లో రాష్ట్ర ప్రజలు తండోపతండాలుగా జగన్ కి నీరాజనం పడుతూ ఉన్నారు.
Image result for చంద్రబాబు
ముఖ్యంగా గత ఎన్నికలలో అబద్ధపు హామీలు ఇచ్చి ఇష్టానుసారంగా చంద్రబాబు వ్యవహరించడంతో రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కోల్పోయాడు అనటంలో సందేహం లేదు. అంతేకాకుండా ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్న నేపథ్యంలో తాజాగా ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో చంద్రబాబుకు తీవ్ర పరాభవం ఎదురవుతున్న ఫలితాలు రావడంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఓడిపోయిన కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పడానికి అనువుగా ఉండటానికి ఎంపీగా కూడా ఎన్నికలలో బరిలోకి దిగాలని ఆయన అలోచిస్తున్నారు అని తెలుగు తమ్ముళ్ళు గుసగుసలాడుకుంటున్నారు.
Related image
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా ప్రస్తుతం తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా..కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా బరిలోకి దిగనున్నారు అంట.
Image result for చంద్రబాబు
రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితులు కొంత తక్కువ ఉంటున్న క్రమంలో...మరి అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి స్పష్టమైన మెజార్టీ రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బిజెపి పార్టీలకు రావడం కూడా కొంత అసంభవం కనుక ప్రాంతీయ పార్టీలను ఏకంచేసి జాతీయ రాజకీయాలలో చంద్రబాబు చక్రం తిప్పాలని ఈ అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: