Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 12:04 am IST

Menu &Sections

Search

విజయ్ మాల్యా గొంతులో పచ్చివెలక్కాయలా చట్టాలు - సవరణలు? అందుకే ఇంత మార్పు!

విజయ్ మాల్యా గొంతులో పచ్చివెలక్కాయలా చట్టాలు - సవరణలు? అందుకే ఇంత మార్పు!
విజయ్ మాల్యా గొంతులో పచ్చివెలక్కాయలా చట్టాలు - సవరణలు? అందుకే ఇంత మార్పు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
national-news-vijay-mallya-white-collar-offences
ఆర్ధిక నేరగాళ్లకు అగ్రజుడు, భారత ఆర్ధిక వ్యవస్థ నవనాడులు ఇరగదీసి, భారతీయ బాంకింగ్ రంగాన్ని నిలువునాముంచి, దోచిన ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేసి వ్యవస్థలోని వ్యక్తుల్ని మందు విందు పొందుల్లో ఓలలాడించి తానూ విలాసాల్లో తేలియాడి దేశసరిహద్దులు దాటేసి లండన్ చేక్కేసిన విలాస పురుషుడు విజయ మాల్యా.  వివిధ బాంకులకు ఆర్ధిక సంస్థలకు వేల కోట్ల ఋణాలు ఎగ్గొట్టి లండన్‌ కు పారిపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌ మాల్యా రెండేళ్ల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నోరు  విప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు ఏమిటో? అసలు నిజాలేమిటో? వెల్లడించాల్సిన బాధ్యత తనపై ఉందంటూ ఓ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.

national-news-vijay-mallya-white-collar-offences

అంతేగాక, దాదాపు ₹13,900 కోట్ల విలువైన తన ఆస్తులను అమ్ముకుని బ్యాంకులు, ఇతర ఋణదాతలకు బకాయిలు చెల్లించేందుకు అవకాశం ఇవ్వాలంటూ కర్ణాటక హైకోర్టును కోరారు. అయితే రెండేళ్ల పాటు తన ఆరోపణలపై మౌనంగా ఉన్నవిజయ మాల్యా ఇలా అకస్మాత్తుగా కాళ్లబేరానికి రావటానికి కారణం ఏమిటి?  అసలెందుకు వచ్చారు? ఈ బహిరంగ ప్రకటన వెనుక విజయమాల్యా ఆంతర్యమేంటీ? అని ఆలోచిస్తే ప్రస్తుతం క్రమ క్రమంగా చోటు చేసుకుంటున్నపరిణామాలు, కఠినంగా మారుతున్న చట్టాలే అయి ఉంటాయా? అనే సందేహాలు అందరిలో ముప్పిరి గొంటున్నాయి వ్యక్తమవుతున్నాయి.

national-news-vijay-mallya-white-collar-offences

* గతేడాది దివాలా, బ్యాంక్రప్సీ చట్టంలో కీలక సవరణలు చేసిన విషయం తెలిసిందే. ఉద్దేశ పూర్వక ఋణ ఎగవేతదారులు, కంపెనీల ఆటకట్టించేందుకు ఈ సవరణలు చేపట్టింది. ఈ సవరణలకు పార్లమెంట్‌ ఆమోద ముద్ర వేసింది.


* ఇక ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్‌, బినామీ లావాదేవీల చట్టం కూడా అమల్లోకి వచ్చింది. అంతేగాక ఆర్థిక నేరస్థుడిగా పేర్కొన్న తొలి వ్యక్తి కూడా విజయ్‌ మాల్యానే.

* 2016 విజయ్‌ మాల్యా దేశం విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అతడి ఆచూకీ కోసం భారత్‌ తీవ్రంగా యత్నించి, చివరకు లండన్‌లో ఉన్నట్లు గుర్తించింది. అతడిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నించింది. విజయ్‌ మాల్యా పాస్‌-పోర్టును కూడా రద్దు చేసింది.

* మరోవైపు విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించాలని కోరుతూ భారత దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ పై ప్రస్తుతం బ్రిటన్‌ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ కేసు తుది విచారణ జులై 31న జరగనుంది. మరో కేసు కూడా తుది దశకు చేరకుంది.

ఈ కారణాల వల్లే విజయ్‌ మాల్యా తాజాప్రకటన చేసి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. నిజంగా విజయ్‌ మాల్యా డబ్బులు చెల్లిస్తారా? భారత్‌కు వస్తారా? వేచి చూడాల్సిందే.

 national-news-vijay-mallya-white-collar-offences


ఇక ప్రభుత్వం దృష్టి నీరవ్ మోడీపైనే

national-news-vijay-mallya-white-collar-offences

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు నామం పెట్టి విదేశాలలో తలదాచుకుంటున్న నీరవ్‌ మోదీకి ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులిచ్చింది. నీరవ్‌ మోది సోదరుడు నిషాల్‌ మోది, ఆయన కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ సుభాష్‌ పరబ్‌కు కూడా ఇంటర్‌పోల్‌ నోటీసులిచ్చింది. నీరవ్‌కు నోటీసులివ్వాలని ఇంటర్‌పోల్‌ను ఇటీవల ఈడి కోరింది. నీరవ్‌ పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ కూడా ఉంది. ఇంటర్‌పోల్‌ నోటీసు ప్రకారం నీరవ్‌ ను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. నీరవ్‌ కు ఎంట్రీ ఇవ్వద్దని విదేశాంగశాఖ వివిధ దేశాలను అభ్యర్ధించింది.

national-news-vijay-mallya-white-collar-offences
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబును టీడీపీ నుంచి బహిష్కరణ ఉత్తర్వులు! అసుర సంహారం ఇక తప్పదేమో?
అధికారకోటను ఉడుములా పట్టుకునే బాబు - హరికృష్ణ కూతురుతో డ్రామా!
"తూ నీ బతుకు చెడ"  కెసిఆర్ పంచ్  కొంప ముంచేలా ఉందే? : ఈసీ కొరడా!
నటీమణులు తమపై లైంగిక వేదింపులను ఎదుర్కోవటం ఎలా? టాప్ హీరోయిన్ సలహా
స్త్రీల అండర్-వేర్ ఇలాగే ఉంటుంది! పార్ల‌మెంట్‌లో ఎంపీ
ప్రొఫెసర్ కోదండరాం జీ! పాతపేపర్లు ముంగటేసుకోండి! : హరీష్ రావు
చంద్రబాబు అబద్ధాలకు, దిగజారుడుకు ఈ సాక్ష్యం చాలదా?
మహాకూటమికి మహావైఫల్యం తప్పదు?
బాలకృష్ణ, కొందరు టిడిపి నాయకులకు పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక
తెలంగాణాలో చంద్రబాబుతో పొత్తు కాంగ్రెస్ కు మరణమృదంగమే
ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం మరో సినిమాటిక్ కుట్ర "ఆపరేషన్ - బి": తమ్మారెడ్డి భరద్వాజ  ఉవాచ!
పారడైజ్‌ అగ్నికి ఆహుతి
"ఏబిపి-సి ఓటర్" సర్వే ప్రకారం తెలంగణాలో మహాకూటమి ప్రభుత్వం - టిఆర్ఎస్ ఫినిష్
క్రేజీ హీరోతో త్వరలో జత కట్టనున్న స్వీటీ అనుష్క
అంతర్జాలంలో బాబు పాత ట్వీట్లకు భలే గిరాకి! ఇంతలా నాలుక మడతెవరేస్తారు!
About the author