టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన దీక్ష ఎంత కామెడీ అయిందో మనకందరికీ తెలిసిందే. రికార్డు స్థాయిలో 10 రోజులు దీక్ష చేసిన ప్రజల నుంచి ఎటువంటి మద్దతు రాలేదు. ఇంకా చెప్పాలంటే ఆ దీక్ష మీద చాలా  అనుమానాలను వ్యక్తం చేసినారు. దీక్ష చేసి పది రోజులు అయినా  సీఎం రమేష్ ఉక్కు లాగా కనిపించాడు. ఈ రహస్యమేమిటో ఎవరికీ అర్ధం కావడంలేదు. మధ్యలో ఈ దీక్షలు ఎంత కామెడీగా సాగుతాయో, ఎందుకు ఈ దీక్షలు చేస్తున్నామో తెలుగుదేశం ఎంపీలు తమలో తాము మాట్లాడుకొంటూ ప్రజల కళ్లు తెరిపించారు.

Image result for cm ramesh

బరువు తగ్గడానికే తమ దీక్షలు అని వాళ్లే చెప్పుకున్నారు. ఓవరాల్ గా సీఎం రమేశ్ దీక్షవల్ల తెలుగుదేశం పార్టీకి మైలేజీ రావడం ఏమోకానీ.. తెలుగుదేశం పార్టీ అన్ని విషయాల్లోనూ అట్టర్ ఫ్లాప్ అని తనకు తానే చాటుకుంది. దీక్షతో తెలుగుదేశం పార్టీ నిజంగానే కేంద్రాన్ని కదిలించి ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏ చిన్న ప్రకటన అయినా చేయించి ఉంటే, అది నిజంగానే టీడీపీకి అడ్వాంటేజీగా మారేది. అయితే సీఎం రమేశ్ సుదీర్ఘమైన దీక్షచేసి ఇచ్చిన సందేశం ఏమిటంటే.. తాము ఏదీ సాధించలేము అని స్పష్టత ఇచ్చాడు. నాలుగు సంవత్సరాలు బీజేపీతో కలిసి కాపురం చేశారు.

Image result for cm ramesh

కేంద్రంలో అధికారంలో భాగస్వామ్యులు అయ్యారు. మోడీ మళ్లీ ప్రధాని కావాలని ఎన్డీయే పక్షాల సమావేశంలో చంద్రబాబు నాయుడు స్వయంగా తీర్మానం చేసి ఆమోదింపజేశాడు.జేపీతో కలిసి ఉన్నంత సేపూ ప్రత్యేకహోదా అవసరం లేదన్నారు. ఇక రైల్వేజోన్, ఉక్కు ఫ్యాక్టరీ ఊసే ఎత్తలేదు. ఇప్పుడు మాత్రం అన్నీకావాలి.. అంటున్నారు. మోడీ ఇవ్వలేదని, మోడీ మోసం చేశాడని అంటున్నారు. అయితే మోడీతో భుజం భుజం రాసుకున్నప్పుడేమో హోదా వద్దు, హోదా అంటే జైలుకే అన్న పెద్దమనిషి, ఇప్పుడు మోడీ చేతిలో మోసపోయే అని కల్లబొల్లి మాటలు చెబితే ప్రజలు నమ్ముతారా? అనేది శేష ప్రశ్న. పచ్చిమోస పూరితమాటలు, దగా మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇక దీక్ష ఎంత ప్రహసనం అవాలో అంతా అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: