ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తున్నారు. అయితే ఇప్పటికే నరేంద్ర మోడీ మీద మరియు బీజేపీ పార్టీ మీద ఆంధ్ర ప్రజలు చాలా కోపంతో ఉన్నారు. అలాగే అన్ని పార్టీలు బీజేపీ మీద కోపంగా ఉన్నారు. టీడీపీ అయితే బీజేపీ నుంచి బయటికి వచ్చిన తరువాత విమర్శల జోరు పెంచిందని చెప్పవచ్చు. అయితే నెల్లూరు లోని శ్రీహరి కోట లో ఒక కార్యక్రమానికి నరేంద్ర మోడీ హాజరు అవుతున్నాడు. 

Image result for narendra modi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు మొత్తం భారతీయ జనతా పార్టీకి ప్రతికూలంగా మారిపోయిన తర్వాతే.. ప్రధాని మోడీ ఓ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించాలని అనుకున్నారు. కేంద్ర ప్రాజెక్టులు ఏవైనా ప్రారంభాలకు సిద్ధంగా ఉంటా వస్తానని కబురు పంపినా.. రావాల్సిన అవసరం లేదన్నట్టుగా బాబు సర్కార్ వర్తమానం పంపింది. ఆ తర్వాత తమిళనాడు, చెన్నై పర్యటనకు వెళ్లిన ప్రధానికి అప్పట్లో కావేరీజలాల కోసం ఉద్యమిస్తున్న తమిళ సోదరులు పెద్దఎత్తున నిరసన తెలియజేశారు. రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సిన షెడ్యూలును ప్రధాని మోడీ మార్చుకుని హెలికాప్టర్లో వేదిక వద్దకే చేరుకున్నప్పటికీ.. తమ నిరసన తెలిపేలా నినాదాలు రాసిన నల్లటి బెలూన్లను గాల్లోకి ఎగరేసి తమిళులు తమ నిరసన తెలిపారు.

Image result for narendra modi

నెల్లూరుజిల్లాలోని సూళ్లూరుపేటకు దూరంగా సముద్రతీరంలో శ్రీహరికోట ఉంటుంది. ఇక్కడి కార్యక్రమానికి ప్రధాని వచ్చినా.. నేరుగా షార్ లోనే ఉండే హెలిపాడ్ వద్దనే దిగుతారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే షార్ లో సాధారణ ప్రజలు నిరసనలు తెలిపే అవకాశమే లేదు. ఆ రకంగా ప్రధాని పర్యటన సేఫ్ గానే ఉంటుంది. అయితే ప్రధాని వచ్చే సమయానికి నల్ల బెలూన్లను ఎగురవేయడం ద్వారా ప్రజలు నిరసన చూపే అవకాశం ఉంది. అయితే అందుకు ఎవరు పూనుకుంటారనేది ప్రశ్న. వైకాపా, జనసేనల కంటె ఎక్కువగా రంకెలు వేస్తూ భాజపా మీద బురద చల్లడమే లక్ష్యంగా ప్రవర్తిస్తున్న తెదేపా కూడా ఈ విషయంలో చొరవ చూపించకపోవచ్చు. తిరుమల వచ్చిన అమిత్ షా పట్ల ఆ పార్టీ నాయకులు చేసిన నిరసన ప్రదర్శనల గొడవతోనే చంద్రబాబు అప్పట్లో బెదిరిపోయినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు ఏకంగా ప్రధాని రాకలో నిరసనధ్వనులు వినిపించే అవకాశం ఉండకపోవచ్చుననే పలువురు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: