నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం, దశాబ్దాల తరబడి అధికారం అయినా జనానికి ఒరగబెట్టిందేమీ లేదు, అసలు టీడీపీకి ఓటెందుకేయాలంటూ జనసేనాని చంద్రబాబుని సూటిగా నిలదీశారు. మాకు పాలనానుభవం లేదంటారు, కానీ మీరు చేస్తున్నదేమిటంటూ గద్దించారు. ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం ఉందని నాలుగేళ్ళకు కానీ తెలియని సీయం మనకు అవసరమా అన్నారాయన. ప్రజా పోరాట యాత్ర రెండవ విడతలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్ కోటలో జరిగిన సభలో పవన్ బాబు సర్కార్ పై నిప్పులే కురిపించారు.



ఆనాడే నా దారికి వచ్చుంటేనా..:



ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ మొదట అడిగిందే నేనన్నారు జనసేనాని. కాకినాడ  మీటింగ్ లో నేను హోదా కోసం గొంతు విప్పిన నాడు బాబుతో సహా టీడీపీ మంత్రులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. హోదా వల్ల ఏమీ రావంటూ అబద్దాలు ఆడింది మీరు కాదా అని బాబుని నిందించారు. అంతా అయ్యాక ఇపుడు హోదా అంటూ రోడ్ల మీదకు వస్తే ఏం లాభమో బాబే చెప్పాలన్నారు. 



మీ అబ్బాయికి మాత్రమే  జాబొచ్చింది బాబూ :



నేను వస్తే యువతకు ఉద్యోగాలు ఇస్తానంటూ హామీ ఇచ్చి సీయం కుర్చీ ఎక్కిన బాబు తన కొడుక్కి మాత్రమే జాబ్ ఇప్పించుకున్నరంటూ పవన్ సెట్టైర్లు వేశారు. ఎన్నికల వేళ నిరుద్యోగ భ్రుతి అంటూ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు యువతకు కావాల్సింది భ్రుతి కాదు, ఉద్యోగాలని పవన్ డిమాండ్ చేశారు.



ఎస్ కోటలో అభివ్రుధ్ధి ఏదీ :



ముప్పయ్యేళ్ళు టీడీపీని మోసారు ఇక్కడి ఓటర్లు, కానీ వారిని టీడీపీ పట్టించుక్న్నదే లేదని పవన్ అన్నారు. ఎస్ కోట పూర్తిగా వెనకబడిపోయిందని, కనీసం ఏదైనా చేయాలన్న ఆలోచన ఉందా అంటూ పవన్ అటాక్ చేశారు. ఆఖరికి  రైల్వే వంతెన కోసం కూడా అమరణ దీక్ష చేసే దుస్థితి బాబు తీసుకువచ్చారని ఫైర్ అయ్యారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: