2014 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో జతకట్టి రాష్ట్రంలో పర్యటించి తెలుగు ప్రజలలో కొంత నమ్మకాన్ని ఏర్పర్చుకుంది అని అన్నారు మంత్రి నారా లోకేష్. తాజాగా ఇటీవల నారా లోకేష్ మీడియా తో మాట్లాడుతూ  కేంద్రం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారం చేపట్టిన బిజెపి ఎక్కువ మెజార్టీ స్థానాలు  రాబట్టుకోవడం వల్ల  అంతకముందు మద్దతు తెలిపినా పార్టీల మాట ఎవరి మాట వినకుండా  రాష్ట్ర బాగోగులు చూడకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారని ధ్వజమెత్తారు.
Image result for naralokesh
చట్టపరంగా రాష్ట్రానికి రావాల్సిన హామీల విషయంలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించిందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఒకలాగా అధికారం వచ్చాక మరొకలాగ భారతీయ జనతా పార్టీ చంద్రబాబు పట్ల వ్యవహరించిందని పేర్కొన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం ఉంది కాబట్టి కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని చంద్రబాబుని కొనియాడారు నారా లోకేష్.
Image result for naralokesh
ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని, నాలుగేళ్లు ఓపిక పట్టామని అయినా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వైసిపి ఎంపీలు, సిఎంను విమర్శించడం మాని కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. వైసిపి నేతలకు దమ్ముంటే ప్రధాని మోదీని నిలదీయాలని సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపి సీట్లు గెలుస్తామని మంత్రి లోకేష్‌ ధీమా వ్యక్తం చేశారు..
Image result for naralokesh
దీంతో వైసీపీ నాయకులు లోకేష్ చేసిన కామెంట్లకి మండిపడ్డారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి జాతీయస్థాయిలో ఆంధ్రరాష్ట్ర పరువు తీసింది చంద్రబాబు అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఎలా పడితే అలా అవినీతిమయం చేస్తూ ఉంటే ఏ ప్రభుత్వం సహకరిస్తుందని నారా లోకేష్ ని ప్రశ్నించారు వైసీపీ నేతలు...మొత్తం పార్లమెంటు స్థానాలు గెలుస్తామని చెబుతున్నా నారా లోకేష్ వచ్చే ఎన్నికలలో కనీసం పోటీ చేసే దమ్ము నీకుందా అని సవాలు విసిరారు...అంతేకాకుండా కనీసం మైక్ పట్టుకొని అయిదు నిమిషాలు తెలుగులో సరిగ్గా మాట్లాడగలవా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి ఉన్న అనుభవం అవినీతి అనుభవం అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: