దేశంలో ఇప్పుడు కూడా స్కాముల కాలమే నడుస్తుంది. అంతే కాదు గత కాలంలో స్కాముల పేరుతో శిక్షలు పడి జైళ్ళ లో ఉన్నవారు కూడా "పత్తిత్తులు" గా ఋజువై చెరసాలల నుండి చిరునామాలకు చేరుకుంటున్నారు. ఇలాంటి స్కాముల మాయాజాలములో చిక్కుకోకుండాలంటే మనం కొన్ని సాంకేతిక చిట్కాలను అనుసరించ వలసిందే. 


ఆ క్రమంలో ఈ మద్య తెలంగాణ లో భారీ "సిమ్‌ కార్డు స్కాం" వెలుగు చూసిన సంగతి తెలిసిందే. నకిలీ వేలి ముద్రలు, ఆధార్‌ కార్డుల తో వేలాది సిమ్‌-కార్డు లను అక్రమం గా యాక్టివేట్‌ చేశాడు ఓ మొబైల్‌ షాపు యజమాని. మన ఆధార్‌ కార్డు తో ఒకే సిమ్‌-కార్డు తీసుకున్నామనే అనుకున్నా, వాటిని నకిలీ చేసి వాటి నుంచి ఎన్ని సిమ్‌-కార్డులు తీసుకున్నారో ఎవరికి తెలుసు? 
Image result for sim card scam in telangana
తెలంగాణలో వెలుగు చూసిన నకిలీ సిం-కార్డ్ స్కాం సంఘటనల తో మన వివరాలను ఉపయోగించుకొని ఎవరు ఏ ఏ దారుణాలకు ఒడిగడుతున్నారో? అనే భయం ఇప్పుడు ప్రతి ఒక్కరి లో ఉంది. అందుకే ఆ భయం పోవడానికి, మీ పేరు తో ఎన్ని సిమ్‌-కార్డులు ఉన్నాయో తెలుసుకోండి. పలు టెలికం కంపెనీల్లో మన ఆధార్‌ కార్డు మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో ఇలా చెక్‌ చేసుకోండి.

Image result for sim card scam in telangana


యూఐడీఏఐ ఆదేశాల మేరకు, గతంలో ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుడు తన ఆధార్‌ కార్డు మీద ఎన్ని సిమ్‌-కార్డులు ఉన్నాయో తెలుసుకు నేలా ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌ను ప్రారంభించింది. ఇప్పుడు ఆ జాబితాలో  ప్రముఖ టెలికాంసంస్థ ఎయిర్‌-టెల్‌ కూడా చేరింది. ఒక్క మెసేజ్‌ తో వివరాలను అందిస్తోంది. జియో తన యాప్‌ లో ఆ వివరాల ను పొందుపరుస్తుంది. అయితే ఐడియా, వొడాఫోన్‌, డొకోమో, టెలీనార్‌, రిలయన్స్‌ కంపెనీలు మాత్రం ఈ సర్వీసులను అందించడం లేదు.



మీఆధార్‌ మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకోండి ఈ క్రింది విధంగా:

• మీరు ఎయిర్‌-టెల్‌ వినియోగదారుడు అయితే, మీఫోన్‌ నుంచి  ADCHK స్పేస్‌ ఆధార్‌ కార్డు నెంబర్‌ టైప్‌ చేసి 121 కి మెసేజ్‌ చేయాలి. మరుక్షణమే మీ ఆధార్‌ కార్డు తో లింక్‌ అయిన నెంబర్ల జాబితా వస్తుంది.


 Image result for sim card scam in telangana

• మీరు జియో వినియోగదారుడు అయితే,  మై జియో యాప్‌, "మై అకౌంట్‌" లో "లింక్ న్యూ అకౌంట్‌" అని ఉంటుంది. అలా కనుక లేకపోతే మీ పేరు మీద ఒక జియో సిమ్‌ ఉన్నట్లే లెక్క.


Image result for jio sim

• మీరు బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్‌ అయితే  ALIST  స్పేస్‌ ఆధార్‌ నెంబర్‌ టైప్‌ చేసి 53734 అనే నెంబర్‌కు మెసేజ్‌ చేయాలి. రిప్లై మెసేజ్‌ లో మీ ఆధార్‌ కార్డు తో లింక్‌ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ సిం నంబర్లు వస్తాయి.


Image result for bsnl sim

మరింత సమాచారం తెలుసుకోండి: