సాధారణంగా అద్దెకు ఇళ్లు తీసుకుంటాం..ఏదైనా వాహనాలు..వస్తువులు తీసుకుంటాం..కానీ అక్కడ మాత్రం అద్దెకు మహిళలను తీసుకోవడం కామన్ గా మారింది. అనుకుంటేనే జుగుప్సగా ఉన్న ఈ విషయం నిజం..ఇలాంటి దారుణాలు మధ్యప్రదేశ్‌తో పాటు, రాజస్థాన్‌, గుజరాత్‌లో తరచూ జరుగుతుంటాయి.  ఈ మద్య భారత దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నా..ఓ వైపు మహిళా సంఘాలు ఈ దారుణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యమాలు చేపడుతున్నారు.  కానీ మధ్యప్రదేశ్‌లో సమాజం తలదించుకొనేలా మహిళలను అద్దెకు ఇస్తారు. 

స్త్రీని దేవతగా పూజించిన దేశం మనది. పురాణాలు, ఇతిహాసాల్లో పతివ్రతల గురించి ఎంతో గొప్పగా విన్నాం.  అంతేందుకు భారత దేశంలో మహిళ కట్టు, బొట్టు గురించి విదేశీయులు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. కానీ మధ్యప్రదేశ్ శివపురి జిల్లాలో దధీచ ప్రాత అనే సాంప్రదాయంతో స్త్రీ అంగడిలో ఆటబొమ్మగా, ఒక వస్తువుగా మారుస్తున్నారు.   ఆచారం ప్రకారం స్త్రీలను లీజుకి ఇవ్వొచ్చట. స్టాంపు పేపరుపై కేవలం ఒక సంతకంతో, ఒక స్త్రీ భర్త మారిపోతాడు. ఒప్పందం కుదిరిన తర్వాత, ఆ మహిళ మరో వ్యక్తికి అమ్ముడుపోతుంది. 

ఒప్పందంలో కూడా పకడ్భందీగా రూ.10 నుంచి రూ.100 వరకూ ఉన్న స్టాంపు పేపర్లపై ఇరు వర్గాలు సంతకం చేస్తాయి.   ఒప్పందం కాలం అయిపోయాక తిరిగొచ్చిన స్త్రీ మరొక వ్యక్తి కోసం బేరంలో నిలబెడతారు. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజన యువతులకు రూ.500 నుంచి రూ.60000 ఇచ్చే విధంగా మధ్యవర్తులు బేరం ఆడతారు. అనంతరం వారికి ఇచ్చే డబ్బులో మధ్యవర్తులు కమీషన్లు వసూలు చేసుకుంటారు. 

మెహ్సానా, పతన్, రాజకోట్, గాంధీనగర్ వంటి జిల్లాల్లో పిల్లలని కనలేని స్త్రీలు, పేద కుటుంబాల వారికి డబ్బు ఎరగా వేసి ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు.   డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కో వ్యక్తి నెలకి రూ.1.5 లక్ష నుంచి 2 లక్షల వరకూ సంపాదిస్తాడు. ఇంత దారుణం జరుగుతున్నా కూడా అక్కడ ఎవరూ ఎలాంటి ఆరోపణలు చేయకపోవడంతో పోలీసుకు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: