జనసేనాని పవన్ మావాడే, మా మంచి వాడేనంటూ మంత్రి అయ్యన్నపాత్రుడు  కొత్త పాట పాడుతున్నారు. రాష్ట్రానికి ఏదో చేయాలన్న తపన పవన్ లో ఉందట.  అయితే సరైన టీం మాత్రం లేదట. అటువంటి పవన్ కనుక తమతో చేతులు కలిపితే అది ఏపీకే మంచిదంటున్నారు ఈ టీడీపీ సీనియర్ నేత.


పవన్ తో కటీఫ్ లేదంట :


పవన్ తో కటీఫ్ అని తమ పార్టీ అధినాయకుడు చంద్రబాబు ఎక్కడా చెప్పలేదని అయ్యన్న అనడం విశేషం.  పైగా తాము ఎపుడూ పవన్ ని తప్పుపట్టిందీ, విభేదించిందీ లేదన్నారు. ఆయన అశయాలు మంచివేనని కూడా మంత్రి మెచ్చడం గమనార్హం. 


టీడీపీతో కలసిరావాలి :


ఏపీలో బీజేపీ, వైసీపీ తప్ప మిగిలిన పార్టీలతో కలసి టీడీపీ  ముందుకు సాగేందుకు అభ్యంతరం లేదంటూ  అవాక్కయ్యే  స్టేట్మెంట్ మంత్రి ఇచ్చేశారు. జనసేన వంటి పార్టీలు ఒంటరిగా కంటే టీడీపీతో సాగితేనే ఏపీ అభివ్రుధ్ధి సాధ్యపడుతుందని అన్నారు. చంద్రబాబు ఏపీ కోసం కష్టపడుతున్నారని, ఆయనకు అంతా సహకరించాలని కూడా అయ్యన్న విన్నపం చేశారు.


సీఎం సీటుకు అనర్హుడు :


వైసీపీ అధినేత జగన్ సీఎం సీటుకు అనర్హుడని ఆయ్యన్న ఫైర్ అయ్యారు. కుర్చీ కోసమే ఆయన తపనంతా అంటూ సెటైర్లు  వేశారు. పదవులు ప్రతిభతో రావాలి కానీ, వారసత్వంతో కాదంటూ కామెంట్స్ చేశారు. మరి ఇలా పవన్ ని మెచ్చుకుంటూ, జగన్ ని తిడుతూ అయ్యన్న టీడీపీ అంతరంగాన్ని బాగానే బయటేసారనుకోవాలి. రేపటి రోజున ఏపీలో మారే రాజకీయ సమీకరణలే ఈ సీనియర్ మంత్రి నోటి వెంట వచ్చాయంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: