ఏపిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ దూకుడు పెంచారు.  వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ ప్రతిష్ట పెంచేందుకు పర్యటనలు కొనసాగిస్తున్నారు.  అమరావతిలో సొంత ఇంటి నిర్మాణం ఆలస్యం అవుతుందని విజయవాడలో ఓ అద్దభవనం తీసుకొని గృహ ప్రవేశం చేశారు.  తాజాగా విశాఖపట్నంలోని సీతమ్మధారలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ రోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాన్ మాట్లాడతూ..గత కొంత కాలంగా అధికార పార్టీ ఉత్తరాంధ్రపై వివక్ష చూపుతూ వస్తుందని అన్నారు.  అమరావతి పై దృష్టి కేంద్రికరించినంతగా ఉత్తరాంధ్ర పై చూపించకపోవడంతో ఇక్కడ ప్రజల కష్టాలు పడుతూనే ఉన్నారని అన్నారు.  అందుకే తాను  ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి నూతన కార్యాలయం వేదిక కావాలని ఆకాంక్షించారు. ‘‘అన్ని వనరులు ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణం.

దీనికి కారణాలను అన్వేషించడంతోపాటు ఈ ప్రాంత సమస్యలకు పరిష్కారాలు సూచించి, అభివృద్ధికి బాటలు వేసేందుకు ఈ కార్యాలయం వేదిక కావాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.  ఈ సందర్భంగా ఆయన  ఉత్తరాంధ్రంలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశమై చర్చలు నిర్వహించారు. ఈ వివరాలను పార్టీ మీడియా విభాగం హెడ్ పి.హరిప్రసాద్ వెల్లడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: