తెలంగాణలో ఎంతో ప్రసిద్ది చెందిన  కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఓ ఆడశిశువు అదృశ్యం కావడం పెను సంచలనం రేపింది.   కాగా, ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీస్ శాఖ వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపారు.  సికందుతో కోఠి నుంచి నేరుగా ఇమ్లీబన్ బస్ స్టేషన్‌కు నిందితురాలు నేరుగా వెళ్లినట్లు గుర్తించారు.
Image result for కోఠీ ఆసుపత్రి
సీపీ కెమెరాల ఆధారంగా బీదర్ బస్సు ఎక్కినట్లు కనుగొన్నారు. 8 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని సుల్తాన్ బజార్ పోలీసులు తెలిపారు. ఇక బస్సు డ్రైవర్ కండక్టర్ ఇచ్చిన వివరాల ప్రకారం నిందితురాలు కొత్త కమాన్ దగ్గర దిగినట్లు గుర్తించామని తనతో కన్నడలో మాట్లాడినట్లు కండక్టర్ చెబుతుండగా పాప తల్లి విజయ మాత్రం... తెలుగులోనే మాట్లాడినట్లు తెలిపింది.

పక్క సమాచారం తో పోలీసులు పాప బీదర్‌లో ఉందని తెలుసుకున్న హైదరాబాద్‌ పోలీసులు అక్కడకు వెళ్లి ఆమెను స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. కాగా, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ అనే మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చి, ఆమె కదల్లేని స్థితిలో ఆసుపత్రిలో ఉంటోంది.
Image result for koti hospital baby kidnap
నిన్న ఆమె వద్దకు వచ్చిన ఓ మహిళ శిశువుకు టీకా ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి, తిరిగి రాలేదు.   పహరణకు గురైన చిన్నారి ఆచూకీ కోసం గాలించేందుకు 6 బృందాలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఆ పసిపాప బీదర్‌లోని ఓ ప్రభుత్వాసుపత్రిలో దొరికిందని పోలీసులు అంటున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: