జనసేన పార్టీ లో వలసలు జరుగుతాయని పుకార్లు వచ్చాయి. అయితే 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న ఇప్పటివరకు ఒక్క పెద్ద నాయకుడు కూడా జనసేన ఖండువ కప్పుకోలేదు. అయితే జనసేన పార్టీ కి ఇంతవరకు సరైన క్యాడర్ లేదని చెప్పాలి. గట్టిగా చెప్పాలంటే కార్యకర్తలు కూడా లేరని చెప్పాలి. అయితే ఏ ధీమా తో  పవన్ పార్టీ లో నాయకులు చేరతారని అర్ధం కావడం లేదు. అయితే ఇందులో నిజం లేదని చెప్పొచ్చు. 

Image result for pavan kalyan and janasena

పవన్ కల్యాణ్ తప్ప ఆ పార్టీలో చెప్పుకోదగ్గ నాయకుడు ఒక్కరు కూడా లేరనే అంతా అనుకుంటున్నారు. అయితే పవన్ మాత్రం.. ఇటు తెలుగుదేశం, అటు వైకాపాలతో పాటూ... రాష్ట్రంలో ఇంకా అనేక మంది మేధావులు, జనంలో బలం ఉన్న ప్రముఖులు తమతో టచ్ లో ఉన్నారని, వారంతా తమ పార్టీలో వచ్చి చేరుతారని అడిగిన వారికి చెప్పుకుంటూ, బయటకు మాత్రం ‘ప్రజలే నన్ను నడిపించే నాయకులు, నా వెంట వారుంటే చాలు’ అని చెప్పుకుంటున్నారు. చూడబోతే.. ‘తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకోవడానికి ఆనాడు చంద్రబాబునాయుడు అనుసరించిన సూత్రాన్ని, మైండ్ గేమ్ నే ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా అందిపుచ్చుకున్నట్లు కనిపిస్తోంది.

Image result for pavan kalyan and janasena

జనసేన పార్టీలో ఉన్న ప్రముఖ నాయకులు ఎవరు అంటే.. తటాల్న పవన్ పేరు తప్ప మరో పేరు ఎవ్వరికీ గుర్తుకురాదు. అయితే... తెలుగుదేశం నుంచి మంత్రిస్థాయిలోని అనేక మంది నాయకులు కూడా ఎగబడి వచ్చి జనసేనలో చేరిపోబోతున్నట్లుగా పుకార్లు మాత్రం పుష్కలంగా వస్తుంటాయి. అలాగే వైకాపా నుంచి కూడా పలువురు రాబోతున్నట్లు పుకార్లు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న భాజపా నుంచి కూడా నాయకులు క్యూ కట్టి జనసేనలోకి వస్తున్నట్లుగా ప్రచారం జరిగింది గానీ.. ఆ దాఖలాలు ఎక్కడా కనిపించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: