జేసి బ్రదర్స్ అనంత లో బలమైన నాయకులు. వీరు పార్టీ తో సంభందం లేకుండా స్వంత బలం తో గెలవగలిగే నాయకులుగా చెప్పవచ్చు. అయితే నియోజక వర్గం లో జేసి బ్రదర్స్ కు మరియు మిగతా ఎమ్మెల్యేలకు గొడవలు తార స్థాయికి చేరాయని చెప్పవచ్చు. అందుకే ఈ ఎన్నికల్లో జేసి బ్రదర్స్ విజయం అంత ఈజీ కాదని మాటలు వినిపిస్తున్నాయి. కొంత‌కాలంగా అస‌లు జెసి బ్ర‌ద‌ర్స్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా అన్న అనుమానాలు జోరుమీదుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేది లేద‌ని బ్ర‌ద‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించినా ఆ ప్ర‌క‌ట‌న‌ను ఎవ్వ‌రూ న‌మ్మ‌టం లేదు.

Image result for jc diwakar reddy

అదే స‌మ‌యంలో బ్ర‌ద‌ర్స్ త‌ర‌పున వాళ్ళ కొడుకులు నియోజ‌క‌వ‌ర్గాల్లో యాక్టివ్ గా తిరుగుతున్నారు. బ్ర‌ద‌ర్స్ కొడుకులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే అందుకు చంద్ర‌బాబు ఆమోదం త‌ప్ప‌నిస‌రి. అయితే, వ‌చ్చే ఎన్నిక‌లు చంద్ర‌బాబుకు చాలా కీల‌కం. 2019లో అధికారంలోకి రాక‌పోతే చంద్ర‌బాబుకే కాదు లోకేష్ తో పాటు చాలా మంది టిడిపి నేత‌ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు. జెసిల‌ను కాద‌ని వాళ్ళ కొడుకుల‌కు టిక్కెట్లిచ్చి చంద్ర‌బాబు ప్ర‌యోగం చేస్తార‌ని ఎవ‌రూ అనుకోవ‌టం లేదు.

Image result for jc diwakar reddy

అదే స‌మ‌యంలో జెసిల వ్య‌వ‌హార‌శైలితో అన్నీ వైపులా వ్య‌తిరేక‌త పెరిగిపోతోంది. ప్ర‌తిప‌క్ష వైసిపి ఎలాగూ జెసి బ్ర‌ద‌ర్స్ ను దెబ్బ‌కొట్టేందుకే చూస్తుంద‌న‌టంలో సందేహం లేదు. మ‌రి, అటువంట‌పుడు సొంత పార్టీ నేత‌లు ఏం చేస్తారు ? ఇక్క‌డే స‌మ‌స్య మొద‌లైంది. పార్టీలోని ఎంఎల్ఏలంద‌రితోనూ అనంత‌పురం ఎంపి జెసి దివాక‌ర్ రెడ్డికి గొడ‌వ‌లే. కాబ‌ట్టి వారెవ‌రూ జెసికి స‌హ‌క‌రిస్తార‌నే న‌మ్మ‌కం లేదు. అదే స‌మ‌యంలో తాడిప్ర‌తి అసెంబ్లీలో కూడా జెసి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హార‌శైలిపై మండిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: