భారత దేశ వ్యాప్తంగా ఏ ప్రాంతంలోనూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మగువలకే కాదు పసిపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రదేశం తో పనిలేదు అది గుడి, బడి, కార్యాలయం, మాల్స్, పార్క్స్, బహిరంగ ప్రదేశాలు ఏవేళైనా కానివ్వండి పగలు రాత్రి మద్యాహ్నం ఎక్కడైనా ఏ వేళైనా స్త్రీకి రక్షణ ఉండటం లేదు.  మైకు దొరికినప్పు డల్లా మహిళల రక్షణ, సాధికారతలపై గొంతు చించుకునే కాంగ్రెస్ పార్టీ‌కి, ఒక్క కాంగ్రేస్ ఏమిటి సమస్త రాజకీయపార్టీలకు తమ  తమ కార్యాలయాల్లో సైతం లైంగిక వేధింపులు చోటు చేసుకుని వారికి తల నొప్పులు తెప్పిస్తూనే ఉంటాయ్. కాకపోతే అవి బైటకు రాలేదు ఇప్పటివరకు. 


అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ  'సోషల్ మీడియా వింగ్‌' లో పనిచేసే ఓ 28 ఏళ్ల యువతి తాను లైంగిక వేధింపులకు గురయ్యానంటూ, సీదాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో పాటు, ఆ పార్టీ సోషల్ మీడియా ఛైర్‌-పర్సన్ దివ్య స్పందనకు, ఢిల్లీ పోలీసు విభాగానికి ఫిర్యాదు చేయడంతో ఆ జాతీయ కాంగ్రెస్ పార్టీలో కలవరం రేపిందని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌ మీడియా కు వివరించారు. 

Image result for congress social media wing chair person divya spandana

సోషల్ మీడియా ఛైర్‌-పర్సన్ దివ్య స్పందన


'కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్‌ ఛైర్‌-పర్సన్' దివ్య స్పందన వద్ద అసిస్టెంట్ గా పనిచేసే చిరాగ్ పట్నాయక్ ‌తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు, ఆ యువతి జూన్ 11న తనకు ఫిర్యాదు చేసినట్టు కమీషనర్ తెలిపారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే చిరాగ్ ప్రవర్తన పై అంతకు ముందే 'ఏఐసీసీ గ్రీవెన్స్ సెల్ ఛైర్‌ -పర్సన్‌' అర్చనా దాల్మీయా కు జూన్ 28న తాను లేఖ రాసినట్లు యువతి తెలిపింది. 

Image result for aicc grievances chairperson archana dalmia

ఏఐసీసీ గ్రీవెన్స్ సెల్ ఛైర్‌ -పర్సన్‌: అర్చనా దాల్మీయా


ఆ లేఖలో తాను తన విధి నిర్వహణలో నిమగ్నమై ఉండగా, చిరాగ్ పట్నాయక్ ఏదో ట్వీట్లు చేయడానికని పదే పదే తన వద్దకు ఉద్దేశ్యపూర్వంగా వచ్చేవాడని, అలా నాకు అతి దగ్గరగా జరుగుతూ, ట్వీట్టర్ ‌‌ఖాతా ను తనిఖీ చేస్తున్నట్లు నటించేవాడని ఆ యువతి తెలిపింది.
Image result for congress social media wing chair person divya spandana
అప్పుడే చిరాగ్ పట్నాయక్ అతని ఉద్దేశ్యం తనకు చిరాకు తెప్పించిందని తనకు ఆయన వ్యవహారం ఆలోచనా సరళి అర్థమైందని వివరించింది. రోజు రోజుకు అతని వేధింపులు మితిమీరగా భరించలేనంతగా తయారయ్యాయని, తర్వాతి రోజు నుంచి పదే పదే తన చేతి పైన, భుజం పైన తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పేర్కొంది. కార్యాలయంలో తాము పనిచేసే వర్క్-స్టేషణ్ ల మద్య దూరం కేవలం 1.2 మీటర్లేనని చిరాగ్ తన కాలిని తన కాలితో తాకించేవాడని, తన అంగాంగాల వైపు  తదేకంగా చూస్తూ మానసికంగా చాలా ఇబ్బంది పెట్టేవాడని, అందువల్ల ఆవాతావరణంలో పనిచేయలేక పోయినట్లు, అతని వేధింపులు భరించలేక చివరకు దివ్య స్పందనకు ఫిర్యాదు చేయగా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆమె స్త్రీఐ ఉండీ మరో స్త్రీ ఇబ్బందిని పిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 
Image for representation
అదనంగా తనకున్న అధికారాలతో తనను అందరి ముందు తనను తిట్టేదని, నా ఉద్యోగం పోతుందని కూడా లెక్కచేయకుండా నేను ఆమెకు తన విధిగా ఫిర్యాదు చేశా నని, మాటలతో, చేతులతో, చేతాతో తనను ఏ విధంగా వేధించాడన్నది ఆ యువతి తెలిపినా, తన ఫిర్యాదు కు కనీస స్పందన కనిపించక పోవటంతో తాను తీవ్ర మనస్తాపా నికి గురై, చివరకు మే 22న తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. 


సదరు యువతి ఢిల్లీ లోని గురుద్వారా రకాబ్‌-గంజ్‌ వద్ద ఉన్న కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రధాన కార్యాలయంలో, సోషల్ మీడియా మేనేజర్‌ గా మార్చి 5న విధుల్లో చేరింది. ఈమె తన రోజు వారీ వ్యవహారాలను దివ్య స్పందన కు రిపోర్ట్ చేస్తుండేది, వీరిద్దరికి చిరాగ్ పట్నాయక్ అనుసంధానకర్తగా వ్యవహారించేవాడు. "నా పోరాటం ఓ వ్యక్తి మీదే కాని, పార్టీ మీద కాదని ఆ యువతి" తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. 


తనను ఇంతగా మనస్థాపానికి గురిచేసిన చిరాగ్ పట్నాయక్ శిక్షించబడాలన్నదే తన ధ్యేయమని తెలిపింది. బాధితురాలు తన వేధింపులపై, మానసికవేదనపై మే 14న పార్టీ సోషల్ మీడియా ఛైర్‌-పర్సన్ దివ్యస్పందనకు ఫిర్యాదుచేసినా, పట్టించుకోకపోగా, పని పేరుచెప్పి తనదృష్టిని మళ్లీంచేందుకు ప్రయత్నించినట్లు యువతి వాపోయింది. 


మే 17నుంచి 24వరకు తాను తీవ్ర మనోవేదన పడినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు చివరిలో "స్పందన గారు మీరు నా పట్ల ప్రవర్తించిన తీరు ఏ మాత్రం సబబుగా లేదు. అతన్ని మందలించకపోగా, కాంగ్రెస్ సోషల్ మీడియా గ్రూప్‌ లో నా తప్పు ఏం లేకపోయినా, పని గురించి తప్పుడుసందేశాలు పంపినన్ను అవమానిం చారు. నా ఉద్యోగధర్మాన్ని, నైతిక విలువలను ప్రశ్నించారు" అని పేర్కొంది. ఈ పరిణామాల వల్ల నేను మే 23నుంచి ఆఫీసుకు వెళ్లలేక పోయానని స్పష్టం చేసింది.


దివ్య స్పందనతో పాటు ఫిర్యాదుల కమిటీ కూడా నిందితుడి నుంచి ఎలాంటి సమాధానం స్వీకరించలేదని తెలిపింది. ఇప్పుడు మాజీ ఉద్యోగిగా స్పందన, ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని, సదరు ఫిర్యాదులో నా టీమ్‌ లోని 39మంది సభ్యుల సంతకాలు పెట్టి నా వెనుకాల నిల్చున్నారని యువతి వెల్లడించింది. 
Image result for sexual assault in indian national congress social media wing
కాగా, "ఆమె వ్యక్తి గత కారణాలు, అనారోగ్యం వల్ల మాత్రమే ఉద్యోగానికి రాజీనామా చేశారని, చివరకు రిజైన్-లెటర్‌ లో కూడా ఇక్కడ పని చేయడం తన కెంతో నచ్చిందని, ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిందని" పార్టీ సోషల్ మీడియా ఛైర్‌-పర్సన్ దివ్యస్పందన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.  
ఇక పోలీసులకు చేసిన ఫిర్యాదు లో సాధారణ ప్రొటో-కాల్ ప్రకారమే చిరాగ్ పట్నాయక్ ఆమె చేస్తున్న పనిని తనిఖీ చేసేందుకు వెళ్లాడని, కానీ అతను తన హోదాను అడ్డం పెట్టుకుని ఆమె పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. ఇక ఈ ఘటనను అస్త్రంగా చేసుకుని బీజేపీ తదితర రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌ను విమర్శించే అవకాశం వుందని విశ్లేషకులు తెలిపారు.


అయితే స్త్రీల విషయంలో ఏ పార్టీ పతివ్రత-పత్తిత్తు కాదని అందరికీ తెలుసు. తనదాకా వస్తేకాని యధార్ధం బోదపడదని అంటున్నారు. 

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: