ప‌వ‌న్ ధోర‌ణి చూస్తుంటే జ‌నసేన‌ను బ‌లోపేతం చేయ‌టం ఉత్త‌రాంధ్ర‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనే  తేలిక‌నుకున్నట్లు అనిపిస్తోంది. ఉత్త‌రాంధ్ర‌తో పాటు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో అత్య‌ధిక సీట్ల‌ను గెలుచుకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానే చ‌క్రం తిప్పొచ్చ‌ని అనుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. అందుక‌నే త‌న ప‌ర్య‌ట‌న‌ల్లో ఎక్కువ‌గా పై ప్రాంతాల్లోనే దృష్టి పెడుతున్న విష‌యం అర్ధ‌మ‌వుతోంది. ఎందుకంటే ఉత్త‌రాంధ్ర‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనే 68 అసెంబ్లీ, 9  లోక్ స‌భ సీట్లున్నాయి. 


స్ప‌ష్ట‌త లేని అంచ‌నాలు


కొన్ని స‌ర్వేల్లో వైసిపికి అనుకూలంగా ఫ‌లితాలు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఒక‌వైపు చంద్ర‌బాబునాయుడేమో మ‌ళ్ళీ మ‌న‌దే అధికారం అని చెబుతున్నారు. స‌రే, అధికారంలోకి వ‌చ్చేదెవ‌రో ఇప్ప‌టికిప్పుడు  స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోయినా మొత్తానికి అంద‌రి దృష్టి అయ‌తే ప‌వ‌న్ మీదున్న‌ది మాత్ర వాస్త‌వం. అందుక‌నే ప‌వ‌న్ కూడా మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంటు స్ధానాల‌పై దృష్టి పెట్ట‌కుండా రెండు ప్రాంతాల‌ మీదే ప్ర‌ధానంగా దృష్టి పెడితే ఎక్కువ లాభముంటుంద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు  స‌మాచారం.  


ల‌క్కంటే కుమార‌స్వామిదే

Image result for kumaraswamy swearing ceremony

మొన్న‌టి క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో 35 సీట్లు తెచ్చుకున్న జెడిఎస్ అధినేత కుమార‌స్వామి ముఖ్య‌మంత్ర‌యిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.  104 సీట్ల‌తో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన బిజెజి, 80 సీట్ల‌లో గెలిచిన కాంగ్రెస్ కు కాకుండా కేవ‌లం 38 సీట్లు వ‌చ్చిన కుమార‌స్వామి ముఖ్య‌మంత్ర‌వ్వ‌ట‌మే విచిత్రం. అదే ప‌రిస్ధితి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కూడా త‌లెత్తితే  తాను  ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం ఉంద‌ని ప‌వ‌న్ బ‌లంగా నమ్ముతున్న‌ట్లున్నారు. నెంబ‌ర్ గేమ్ లో ఇదే  జ‌రుగుతుంద‌ని, అది జ‌రిగే అవ‌కాశం లేద‌ని క‌చ్చితంగా ఎవ‌రూ చెప్ప‌లేరు.  ఎందుకంటే, ఎవ‌రి అవ‌స‌రాలు, ఎవ‌రి అవ‌కాశాలు వాళ్ళ‌వే. 


బ‌ల‌హీనంగా వైసిపి.. గ‌బ్బుప‌ట్టిన టిడిపి

Image result for chandrababu and jagan

నిజానికి ఉత్త‌రాంధ్ర‌లో వైసిపి బ‌ల‌హీనంగా ఉంది.  మూడు జిల్లాల్లోని 34 అసెంబ్లీ సీట్ల‌లో వైసిపికి 15 సీట్ల‌లోనే గ‌ట్టి అభ్య‌ర్ధులున్నారు. మిగిలిన చోట్ల మంచి అభ్య‌ర్ధుల‌ను వెతుక్కుంటున్నారు. అదే స‌మ‌యంలో టిడిపి కూడా బాగా బ‌ల‌హీన‌మైపోయింది. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, అవినీతి, అక్ర‌మాల‌తో టిడిపి గ‌బ్బుప‌ట్టిపోయింది.  ఈ నేప‌ధ్యంలోనే  కాస్త గ‌ట్టిగా ప్ర‌యత్నించి  మెజారిటి స్ధానాలు గెలుచుకోవ‌చ్చ‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. అదే విధంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కూడా ప‌రిస్దితి ఇదే విధంగా ఉంది. 


సీమ‌లో వైసిపి-కోస్తాలో టిడిపి

Image result for tdp and ycp logos

రాయ‌ల‌సీమ‌లో వైసిపి బ‌లంగా ఉండ‌గా, కోస్తా ప్రాంతంలో టిడిపికి ప‌ట్టుంది. కాబ‌ట్టి  వ‌చ్చే ఎన్నిక‌ల్లో అటు వైసిపి కానీ ఇటు టిడిపి కానీ ఒంట‌రిగా అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువే అని ప‌వ‌న్ చేయించుకున్న స‌ర్వేలో తేలింద‌ట‌. అంటే ప‌వ‌న్  అనుకుంటున్న‌ట్లు అదే నిజ‌మైతే  మూడో స్ధానంలో నిలిచే పార్టీనే అధికారంలో ఎవ‌రుండాల‌నే విష‌యంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. కర్నాట‌క‌లో కుమార‌స్వామికి వ‌చ్చిన‌ట్లే ఏపిలో త‌న‌కు కూడా ఎందుకు అవ‌కాశం రాద‌న్న‌ది ప‌వ‌న్ లాజిక్. ఎవ‌రి అంచ‌నాలు ఏ మేర‌కు నిజ‌మ‌వుతాయో ఇప్ప‌టికైతే స‌స్పెన్సే. 


మరింత సమాచారం తెలుసుకోండి: