ఖగోళంలో మరో అద్భుతం జరగనుంది... జులై 27న ఆకాశంలో అరుదైన 'అరుణ వర్ణ చందమామ (బ్లడ్ మూన్)' కనువిందు చేయనుంది. 103 నిమిషాల పాటు అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం చరిత్రలో నిలిచిపోనుంది.  దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కనిపించే ఈ గ్రహణం 1:43 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇది చాలా అద్భుతమైన అవకాశమని, ప్రతి ఒక్కరు తప్పక వీక్షించాలని కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ప్లానెటోరియం డైరెక్టర్ దేవీప్రసాద్ దౌరీ అన్నారు. 


దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలు, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా ప్రాంతాల్లో గ్రహణం కనిపిస్తుందని ఆయన వివరించారు.  జూలై 27న రాత్రి 11:45 నిమిషాలకు గ్రహణం పట్టనుంది. అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకు సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. తెల్లవారుజామున 2:43 గంటల వరకు ఇది కొనసాగుతుంది. 3:49 గంటల వరకు పాక్షిక చంద్ర గ్రహణాన్ని వీక్షించవచ్చని దౌరీ తెలిపారు. 


ఈ ఏడాది జనవరి 31న కూడా సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. గ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా కనుమరుగు కాకుండా... భూ వాతావరణంపై ప్రసరించే సూర్యకాంతి వల్ల ఎరుపు రంగును సంతరించుకోనున్నాడు అంటోంది కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్. 
ఈ బ్లడ్ మూన్ ప్రపంచంలోని తూర్పు అర్ధగోళంలో మాత్రమే కనిపిస్తోంది అంటున్నారు కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ ఎంపీ బిర్లా ప్లానెటోరియం డైరెక్టర్ దేబీప్రసాద్ డూరి... యూరోప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఆసియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రజలు ఉదయం వేళలో,  ఐరోపా, ఆఫ్రికా ప్రజలు సాయంత్రం వేళలో గ్రహణ దృశ్యాన్ని వీక్షించవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: