తెలంగాణ అధికార పార్టీలో మొన్నటి వరకు అసమ్మతిగళం వినిపించిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మమ్మల్ని మించిన నాయకులు ఎవరూ లేరంటూ తలెగరేసిన వారంతా ఇప్పుడు అధినేత కేసీఆర్ ని కలిసి ఆబ్బె అదేమీ లేదు అవన్నీ వట్టి పుకార్లే అంటూ వివరణ ఇచ్చుకుంటున్నారు.  టీఆర్ఎస్‌ లో లెక్కకు మించి నాయకులు చేరిపోయారు వచ్చే ఎన్నికల్లో అందరికీ టికెట్లు ఇవ్వడం అసాధ్యం . అందుకే ముందు జాగ్రత్తగా కొంతమంది నేతలు.. తాము పార్టీ మారబోతున్నట్లు ప్రచారం చేయించేసుకుంటున్నారు. ఇలాగైనా.. కేసీఆర్‌ను బ్లాక్ మెయిల్ చేయాలనేది వారి ఉద్దేశం అయితే ఇలాంటి వారందర్నీ ఒక్క డీఎస్‌ వ్యవహారంతో కేసీఆర్ సెటిల్ చేసేశారట. 

Image result for KCR

పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నాడని, పార్టీ మారే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాడని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ మీద ఆరోపణలు వచ్చాయి. డీఎస్‌పై వేటు వేయాలని నిజామాబాద్ జిల్లా నేతలు కూడా తీర్మానం చేసి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపారు. కానీ డీఎస్ తాను పార్టీ మారేందుకు ఎవరితోనూ చర్చలు జరపలేదని, ఈ విషయంపై కేసీఆర్‌తో మాట్లాడతానని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ కేసీఆర్ నుంచి డీఎస్‌కు పిలుపు రాలేదు. అసలు డీఎస్ కి ఆ అవకాశం ఇచ్చే ఉద్దేశం కూడా కనిపించడంలేదు. 

Image result for D SRINIVAS

ఇక్కడే కేసీఆర్ తన తెలివితేటలకు పదునుపెట్టాడు. పార్టీ మారుతంని బెదిరించే నాయకులందరికీ ఇది ఒక గుణపాఠం కావాలని కేసీఆర్ ఆలోచన. వాస్తవంగా  డీఎస్ ఇప్పటికి కాంగ్రెస్ పార్టీతో పూర్తి స్థాయిలో చర్చలు జరపలేదు. కానీ కేసీఆర్ మాత్రం వ్యూహాత్మకంగా టీఆర్ఎస్‌ వైపు చూడకుండా చేశారు. కేసీఆర్ నిరాదరణ చూపించిన తర్వాత ఇక పార్టీలో డీఎస్‌కు భవిష్యత్ ఉండటం అసాధ్యం. కొద్ది రోజుల కిందట ఎమ్మెల్సీ భూపతి రెడ్డికి కూడా ఇదే రకమైకమైన ట్రీట్‌మెంట్ ఇచ్చారు. 


దీంతో పార్టీ మారుతామంటూ సంకేతాలు ఇస్తూ కేసీఆర్ ని బెదిరింపులకు గురిచేస్తున్న నాయకులు ఇప్పుడు ఆత్మ రక్షణలో పడ్డారు. వీరిలో ముఖ్యంగా .. తాటికొండ రాజయ్య, కొండా సురేఖ, సోమరపు సత్యనారాయణ, ఎంపీ పాటిల్ లాంటి వారంతా.. కేటీఆర్‌ను కలిసి తమపై వస్తున్న వార్తలు వట్టి పుకార్లే అని వాటి గురించి నమ్మి మా మీద అనుమానం పెంచుకోవద్దని బతిమిలాడుకుంటున్నారట. దీంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అసమ్మతి నాయకులకు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేయడంతో పాటు .. భవిష్యత్తులో ఎవరూ ఆ సాహసం చేయకుండా కేసీఆర్ తన మార్క్ తెలివితేటలు చూపించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: