గత కొన్ని రోజుల నుంచి ఏపిలో టీడీపీ వర్సెస్ వైసీపీ మద్య ఎన్నోసార్ల మాటల యుద్దం నడుస్తూనే ఉంది.  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. తనను  వైసీపీలో చేరాలంటూ రూ.30కోట్లు ఆఫర్ చేశాడని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  జగన్ డబ్బు మనిషని... కడప యాసలో ఎప్పుడూ 'లెక్క.. లెక్క' అంటూ తపించిపోతుంటాడని అన్నారు. ఒకరోజు తన వద్దకు ఎంపీ విజయసాయిరెడ్డిని పంపి రూ. 30 కోట్లు అడిగారని... అయితే, 'మీ తాత, మీ నాన్న కంటే నేనే పెద్ద రెడ్డిని' అని చెప్పానని అన్నారు.  


 కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబును వ్యతిరేకించానని, ఆయనపై అప్పట్లో విమర్శలు కూడా చేశానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితమైన తరువాత జగన్‌ కంటే చంద్రబాబే మేలనిపించి టీడీపీలోకి వెళ్లానన్నారు. ఈనాడు గాంధీని మనం చూడలేకపోయినా, ప్రతి ఒక్కరికీ గాంధీ అంటే తెలుసునన్నారు. 


చంద్రబాబు కూడా ప్రజలకు మేలు చేసే వ్యక్తిత్వమున్న వ్యక్తి అని, మంచి పనులు చేస్తే చనిపోయిన తరువాత కూడా పది కాలాలు గుర్తుంచుకుంటారనే తపన కలిగి మంచి పనులు చేస్తున్నారన్నారు. రాయలసీమకు నీరందిస్తే చీనీ, అరటి, దానిమ్మ వంటి పండ్ల తోటల ద్వారా రైతులు లక్షలాది రూపాయల ఆదాయాన్ని పొందుతారని... అందుకే ఎక్కడో ఉన్న నీటిని రాయలసీమకు చంద్రబాబు మళ్లించారని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: