ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు భారత ప్రభుత్వం గట్టివార్నింగ్‌ ఇచ్చింది. వాట్సాప్‌లో అసత్య వార్తలు ప్రచారం కావడం వల్ల పలువురు అమాయకులపై కొందరు దాడులకు దిగుతున్నారని.. అటువంటి తప్పుడు సందేశాలు వైరల్‌ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్రం వాట్సాప్‌ను హెచ్చరించింది.  ‘వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రచారం కావడం వల్ల అవి నిజమని ప్రజలు నమ్ముతున్నారు. దీంతో పలువురు అమాయకులపై దాడికి దిగుతున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వారు, పరాయి భాషలో మాట్లాడే వారు, చిన్న పిల్లలతో కలిసి కనిపించిన అపరిచితులపై దాడి చేసి చంపేస్తున్నారు. పుకార్లు, నకిలీ వార్తల్ని నమ్మొద్దంటూ పోలీసులు చేస్తున్న ప్రచారం పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు.

Fake news on WhatsApp is inciting lynchings in India - Sakshi

ఫలితంగా ఒక్కోసారి బాధితులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వాట్సాప్ ద్వారా ఫేక్ న్యూస్ లు బాగా చెలామణి అవుతున్నాయని..కొన్ని అసభ్యకరమైన న్యూస్, వీడియోలు వాట్సప్ ద్వారా ప్రచారం అవుతున్నాయని అభిప్రాయ పడ్డారు.    ఆ మద్య . పిల్లలను అపహరించుకుపోతున్నారంటూ వాట్సాప్‌లో నకిలీ వార్తలు వైరల్‌గా మారాయి. ఇటువంటి ఘటనలు అసోం, మహారాష్ట్ర, కర్ణాటక, త్రిపుర, పశ్చిమ్‌ బంగా రాష్ట్రాల్లో ఇటీవల చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు చాలా బాధించాయి. 

Image result for whatsapp fake news

గత నెలలో హైదరాబాద్‌లోని బీబీనగర్‌లో ఆటోడ్రైవర్‌ బాలకృష్ణను కిడ్నాపర్‌ అన్న అనుమానంతో గ్రామస్తులు కొట్టి చంపిన ఘటనతో తెలంగాణ పోలీసు యంత్రాంగం ఉలిక్కిపడింది. కానీ, వాట్సాప్‌లో ఇలాంటి నకిలీ వార్తల వ్యాప్తిని అరికట్టడం కష్టమేనని తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు అంటున్నారు.


రెచ్చగొట్టే విధంగా ఉండే సందేశాలు ఇకపై వాట్సాప్‌లో వైరల్‌గా మారకుండా సదరు సంస్థ తగిన చర్యలు తీసుకోవాలి’ అని ఐటీ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. హింసాకాండను ప్రేరేపిస్తున్న వాట్సాప్‌ మెసేజ్‌లపై ఇప్పటికే పదేపదే వాట్సాప్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రభుత్వం పేర్కొంది. గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న దారుణ హత్యల నేపథ్యంలో వాట్సాప్‌ సీనియర్‌ ప్రతినిధులకు తమ తీవ్ర అసంతృప్తి తెలియజేశామని, తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించామని చెప్పింది.


 మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఇలాగే చిన్నారులను అపహరించుకుపోయే గ్యాంగ్‌ తిరుగుతుందని వాట్సాప్‌లో సందేశం వైరల్‌గా మారింది. దీంతో ఆ ప్రాంతంలో తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను పిల్లలను అపహరించుకుపోయే వారిగా భావించి అక్కడి గ్రామస్థులు వారిని కొట్టి చంపారు. వాట్సాప్‌ లాంటి వేదికలు దుర్వినియోగ కావడంపై ఆందో ళన వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను ప్రేరేపించే సందేశాలను విస్తరింపజేయకుండా చూడాలని కోరింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: