లోకేష్ తన ఇమేజ్ ను పెంచుకోవడానికి ట్విట్టర్ లో అడ్డదారులు తొక్కి పద్దతిగా బుక్ అయ్యాడు. ప్రజలను మోసం చేయాలని చూసాడు దానికి ట్విట్టర్ ను వేదిక గా చేసుకున్నాడు.ఇమేజ్ ను  పెంచుకోవడానికి ఒక మంత్రి అయిఉండి ఇలా చేయడం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇంతకు లోకేష్ బాబు ట్విట్టర్ ను ఎలా ఉపయోగించాడంటే, ట్విటర్లో ఎవరో తమ సమస్యలను చెప్పుకుంటే వాటికి పరిష్కరంగా మరో ట్వీట్ పెట్టేస్తే.. అమాంతం పేరు వచ్చేస్తుందని లోకేష్ లెక్కేశాడు. బహుశా లోకేష్ కాకపోయినా.. ఆయన టీమ్ లెక్కేసింది. అందుకు అనుగుణంగా పక్కా స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు.

Image result for lokesh nara

సమస్యలను తామే ట్వీట్ చేసేసి వాటి స్పందనను నారాలోకేష్ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి పోస్టు చేసేసి ఇలా మొత్తంగా లోకేష్‌కు బాగా పేరు తెచ్చిపెట్టే ప్రయత్నం ఒకటి చేశారు. అయితే సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని ఇలాంటి అయాచితమైన క్రెడిట్ ను సొంతం చేసుకోవాలన్న లోకేష్ ప్రయత్నానికి భంగపాటు తప్పలేదు. ఇప్పుడు లోకేష్ అండ్ కో వ్యవహారం మొత్తం బట్టబయలు అయ్యింది. నకిలీ ట్విటర్ అకౌంట్ల నుంచి సమస్యలను పోస్టు చేసిన వైనం బయటపడింది. అప్పటికప్పుడు ఖాతాలను క్రియేట్ చేయడం, వాటి ద్వారా ఏవో సమస్యలను చెప్పడం, లోకేష్ ఖాతాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం, వాటిపై లోకేష్ స్పందించేస్తారనమాట. వాటిని లోకేష్ 24గంటల్లో పరిష్కరించేస్తారనమాట. ఇలా లోకేష్ సమస్యలను పరిష్కరించేస్తున్నాడని నెటిజన్లు అంతా అనుకోవాలి. రేపు అదే పేపర్లో రావాలి.

Image result for lokesh nara

అందుకే... నకిలీ ఖాతాలను క్రియేట్ చేసి, వాటి ద్వారా సమస్యలను విన్నవించే ప్రక్రియను మొదలుపెట్టారు. వాటిని పరిష్కరించేసినట్టుగా మరుసటి రోజులు ఏవో ఫొటోలు పెట్టడం, దానికి లోకేష్ కు మళ్లీ ఆ నకిలీ అకౌంట్ నుంచి ధన్యవాదాలు తెలపడం. ఇదీ వరస. ఒకటీ రెండుకాదు.. లోకేష్ పరిష్కరించేసిన ప్రతి సమస్యా ఇలాంటి నకిలీ ఖాతాల నుంచి వచ్చినవే. ఆ ఖాతాలో నకిలీవి అని చెప్పడానికి బోలెడన్ని ఆధారాలున్నాయి. ఆ అకౌంట్స్ ను అప్పటికిప్పుడు ప్రారంభించడం మొదటి ఆధారం. వాటికి ఒక్క ఫాలోయర్ కూడా లేకపోవడం రెండో ఆధారం. లోకేష్ ను ట్యాగ్ చేసిన ట్వీట్ తప్ప.. అంతకు ముందు, ఆ తర్వాత.. ఆ అకౌంట్ల నుంచి ఎలాంటి ట్వీట్లు రాకపోవడం మూడో ఆధారం. ఇదంతా పక్కా ప్లాన్ తో చేశారని.. లోకేష్ అండ్ కో దొరికిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: