జనసేనాని లోకల్ పాట పాడుతున్నారు. స్థానికుడికే పార్టీ టికెట్ అని షరతు పెడుతున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చి ఉత్తరాంధ్రపై పెత్తనం చేస్తానంటే ఊరుకునేది లేదని కరాఖండీగా చెప్పేస్తున్నారు. కావాలంటే పార్టీకి సేవ చేసుకోండి, టికెట్ మాత్రం అడగకండంటున్నారు. దీంతో వలస నేతలు షాక్ తింటున్నారు అసలు ఈ జిల్లాలలో రాజకీయం చేస్తున్నదే వలస నాయకులు మరి.


వర్కౌట్ అవుతుందా :


రాజకీయ నాయకులు గొప్ప మాటలు చెప్పడం చాలా కామన్. మేము సామన్యుడికే టికెట్ ఇస్తాం, దబ్బు రాజకీయాలను పక్కన పెడతామని సుద్దులు చెప్పే లీడర్లంతా చివరకు టికెట్ ఇచ్చేది బడా బాబులకే. కులం, మతం, ప్రాంతం చూడమని భారీ స్టేట్మెంట్లు ఇచ్చి ఆనక తమ కులపోళ్ళకే పట్టం కట్టిన మహా నాయకులనూ చూశాం. ఉత్తరాంధ్ర జిల్లాలలో ఇపుడు పాలిట్రిక్స్ ప్లే చేస్తోందే వలసొచ్చిన నాయకులు. మంత్రులు, సామంతులంతా వారే. ఆఖరికి లోకల్ బాడీ ఎన్నికలలోను వారే హవా చలాయిస్తున్నారు. అన్ని పార్టీలు దిగుమతి సరుకునే నెత్తిన తెచ్చి పెడుతున్నాయి. ఈ టైంలో పవన్ అన్న మాటలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయన్నది పెద్ద ప్రశ్న.


ముందు షాక్ ఆయనకేనా :


పవన్ పార్టీలో చేరుతారంటూ ఈ మధ్య ఆ మంత్రి గారి మీద ఒకటే ప్రచారం జోరందుకుంటోంది. మరి గంటా ఇక్కడి వారు కాదు, అచ్చమైన ప్రకాశం జిల్లా వాసి. పవన్ పడికట్టు పదాలు చెబుతూ మడి కట్టుకుంటే మొదటి షాక్ తగిలేది గంటా వంటి వారికేనంటున్నారు. అలాగే ప్రజారాజ్యం పుణ్యమా అని క్రిష్ణా జిల్లాకు చెందిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ సులువుగా అయిపోయారు. అదే బాటలో పంచకర్ల రమేష్ బాబు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మరి ఆనాడు యువరాజ్యం నేతగా ఉండి వీరందరినీ ప్రోత్సహించింది పవనే కదా అన్న సెటైర్లు పడిపోతున్నాయి. ఇపుడు కూడా జనసేనలో హడావుడి చెస్తున్న వారిలో ఎక్కువమంది వలస నేతలేనంటున్నారు.

చీల్చి చెండాడుతున్న జనసేనాని :


ఇక, ఉత్తరాంధ్ర టూర్లో  పవన్ ప్రధానంగా వలస నేతలపైనే విరుచుకుపడుతున్నారు. వారు ఇక్కడికి వచ్చి పదవులు తీసుకున్నారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. వారికి లోకల్  సమస్యలు అర్ధం కావని, ఆ అవసరం కూడా లేదని పంచ్  డైలాగులు  పేల్చుతున్నారు.  అందుకే రైల్వే జోన్ లాంటివి విశాఖకు రాలేదని కూడా అంటున్నారు. తమ పార్టీ మాత్రం లోకల్ క్యాండిడేట్
కే టికెట్ ఇచ్చి ఉత్తరాంధ్రను అభివ్రుధ్ధి చేస్తుందని హామీ కూడా ఇస్తున్నారు.


పబ్లిసిటీ కోసమేనా :


పవన్ చెప్పేది ఆయన కూడా అమలు చేయలేరని, విశాఖ వంటి మెగా సిటీలో వేరే రాష్ట్రాల వారు, దేశాల వారు కూడా ఉంటున్నారని  ఇతర పార్టీలు కౌంటర్లేస్తున్నాయి. ప్రజా సేవ ఎవరు చేస్తారన్నది ఇంపార్టంట్ కానీ, మిగిలినవి జనాన్ని రెచ్చగొట్టే స్లోగన్స్ మాత్రమేనని అంటున్నాయి. ఇక పవన్ తీరు చూస్తే ఆయనది నిలకడ లేని మనస్తత్వమని, ఇవాళ చెప్పినది రేపు ఉండదని, సో సీరియస్ గా తీసుకోవాల్సిందేమీ లేదని వలస నాయకులు అంటున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: