భారత దేశంలో జాతీయ గీతానికి ఎంతో గౌరవం ఇస్తారు.  ఇక జాతీయ వేడుకల సందర్భంగా  జెండావిష్కరణ సమయంలో జాతీయ గీతాన్ని ఆలాపిస్తుంటారు.   ఈ మద్య సినిమా థియేటర్లో కూడా జాతీయగీతాన్ని ఆలాపిస్తున్న విషయం తెలిసిందే. అలాంటిది శ్రీనగర్ యొక్క షేర్-ఎ-కాశ్మీర్ విశ్వవిద్యాలయ సమావేశాలలో జాతీయ గీతానికి అవమానం జరిగిందని వార్తలు వస్తున్నాయి. 

శ్రీనగర్ లో ఓ కళాశాలలో జాతీయ గీతం ప్రదర్శిస్తున్న సమయంలో కొందరు కాలేజీ విద్యార్థులు కూర్చుని ఉన్న ఓ వీడియో వైరల్ అవుతుంది. గతంలో కూడా  రాజౌరిలోని బాబా గులామ్ షా బాద్షా యూనివర్శిటీలోని ఇద్దరు విద్యార్ధులు జాతీయ గీతాన్ని అగౌరవం జరిగింది. 

 ఈ ఏడాది మార్చిలో జాతీయ గీతాన్ని అవమానపరిచిన ఆరోపణలపై కోచిలోని తన కళాశాల నుండి ఒక స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) నాయకుడు సస్పెండ్ చేశారు.  తాజాగా మరోసారి  షేర్-ఎ-కాశ్మీర్ విశ్వవిద్యాలయంలో కూడా జాతీయ గీతానికి అవమానం జరిగిందని వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: