సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రి నుంచి కిడ్నాపైన తన బిడ్డను తిరిగి తన ఒడికి చేర్చడంలో కీలకపాత్ర పోషించిన ఏసీపీ చేతన పేరునే ఆ చిన్నారికి పెడుతున్నట్లు తల్లి సబావత్‌ విజయ ప్రకటించారు. తమకు దైర్యం చెప్పడానికి ఆస్పత్రికి వచ్చిన నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌కు ఈ విషయం తెలిపారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ చిన్నారిని సైతం చేతన లాంటి అధికారిగా చేయాలని విజయ నుంచి మాట తీసుకున్నారు. 
Image result for koti hospital kidnap
కాగా, సుల్తాన్‌ బజార్‌ లోని ప్రసూతి ఆసుపత్రి నుంచి ఆరు రోజుల శిశువును ఎత్తుకెళ్లిన మహిళను బీదర్ లో గుర్తించిన పోలీసులు ఆమెను నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. ఆమె పేరు నైనా అని, వయసు 25 సంవత్సరాలని, భర్తతో లకసి బీదర్ లోని షాగంజ్ ప్రాంతంలో నివసిస్తోందని తెలిపారు. తనకు రెండుసార్లు అబార్షన్ కావడంతో ఆ చిన్నారిని పెంచుకునేందుకే తీసుకు వెళ్లినట్టు నైనా ప్రాథమిక విచారణలో వెల్లడించినట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.
Rescued baby girl named after ACP - Sakshi
ఆమె భర్త సైమన్ పండ్ల వ్యాపారం చేస్తుంటాడని, ఎలాగైనా తల్లిని కావాలన్న ఉద్దేశంతో గత శుక్రవారం నాడు హైదరాబాద్ కు వచ్చి, రెండు, మూడు ఆసుపత్రులు తిరిగి, ప్రసూతి ఆసుపత్రిని ఎంచుకుని, అక్కడ సుజాత జన్మనిచ్చిన శిశువును అపహరించిందని వెల్లడించారు.

అయితే పాప కిడ్నాప్ అయిన వెంటనే విషయం కాస్త సీరియస్ గా టీవీ ఛానల్స్, వెబ్ న్యూస్ లో ప్రచురణ కావడం, బీదర్ కు పోలీసు బృందాలు వెళ్లడం, టీవీ చానళ్లలో కిడ్నాప్ వార్త ప్రముఖంగా వస్తుండటంతో నైనా ఆ చిన్నారిని బీదర్ లోని ఓ ఆసుపత్రి వద్ద వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే.  మొత్తానికి చిన్నారి తల్లిచెంతకు చేరడంతో కథ సుఖాంతం అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: