విద్యావ్య‌వ‌స్ధ ఇంత‌లా భ్రష్టుప‌ట్ట‌టానికి  పాప‌మంతా అస‌లు త‌ల్లి, దండ్రుల‌దేనా ?  త‌ల్లి, దండ్రుల అత్యాసే కార్పొరేట్ విద్యా సంస్ధ‌లు పుట్ట గొడుగుల్లా పెర‌గటానికి కార‌ణ‌మైంది.  ఎప్పుడైతే  కార్పొరేట్ విద్యాసంస్ధ‌లు పుట్ట‌గొడుగుల్లా పెరిగిపోయాయో వాటి మ‌ధ్య కాంపిటీష‌న్ పెరిగిపోయింది. కాంపిటీష‌న్ ను త‌ట్టుకోవ‌టానికి కొన్ని విద్యాసంస్ద‌లు అడ్డ‌దారులు తొక్క‌టం మొద‌ల‌య్యాయి. అందులో నుండి వ‌చ్చిందే ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీలు. ఈ మొత్తానికి త‌ల్లి, దండ్రుల అత్యాసే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. 


పిల్ల‌ల సామ‌ర్ధ్యాన్ని, ఆస‌క్తిని గుర్తించ‌రా ? 

Image result for eamcet 2016 question paper leakage

త‌మ పిల్ల‌ల కెపాసిటీని గుర్తించ‌కుండా ఇంజ‌నీర్లు, డాక్ట‌ర్లు అయిపోవాల‌ని త‌ల్లి, దండ్రులు కోరుకుంటున్నారు. అందుకోసం పిల్ల‌ల సామ‌ర్ధ్యంతో సంబంధం లేకుండా వేలాది రూపాయ‌లు క‌ట్టి  కార్పొరేట్ విద్యాసంస్ధ‌ల్లో చేర్పిస్తున్నారు.  విద్యా సంస్ధ‌ల యాజ‌మాన్యాలు కూడా పిల్ల‌ల‌ను యంత్రాలుగా మార్చేస్తున్నాయ్. ర్యాంకుల కోసం పిల్ల‌ల్ని  గ్రైండ‌ర్లో వేసి పిండి రుబ్బిన‌ట్లు రుబ్బేస్తున్నారు. ఇక్క‌డ పిల్ల‌ల ఆస‌క్తి క‌న్నా వాళ్ళ త‌ల్లి, దండ్రుల ఆరాటం,  ఒత్తిడే ఎక్కువ ప‌నిచేస్తుంది. 


త‌ల్లి, దండ్రుల ఆరాట‌మెంత ?

Image result for eamcet 2016 question paper leakage

సామర్ధ్యంతో సంబంధం లేకుండా త‌మ పిల్ల‌ల్ని ఇంజనీర్లు, డాక్ట‌ర్లు చేయాల‌ని త‌ల్లి, దండ్రులు ఆరాట‌ప‌డుతున్నారో వారే కార్పొరేట్ విద్యాసంస్ద‌లకు టార్గెట్ గా  మారుతున్నారు. ర్యాంకులు తెచ్చుకోవ‌ట‌మే ప‌ర‌మావ‌ధిగా మారిపోయిందో కొంద‌రు త‌ల్లి, దండ్రులు, కార్పొరేట్ విద్యాసంస్ధ‌ల్లో మ‌రి కొంద‌రు క‌లిసి కుమ్మ‌కై  ర్యాంకుల కోసం అడ్డ‌దారులు తొక్క‌టం మొద‌లుపెట్టారు.  దాంతో మొత్తం విద్యావ్య‌వ‌స్దే భ్ర‌ష్టుప‌ట్టిపోయింది. త‌ల్లి, దండ్రుల ఒత్తిడిని త‌ట్టుకోలేక పిల్ల‌లు పావులుగానో లేక‌పోతే బ‌లిప‌శువులుగానో మారిపోతున్నారు. 
 
త‌ల్లి, దండ్రుల అత్యాసే  విద్యాసంస్ధ‌ల టార్గెట్ 

Image result for eamcet 2016 question paper leakage corporate colleges

2016లో ఎంసెట్ లీకేజీలో జ‌రిగింద‌దే. త‌మ పిల్ల‌ల‌కు అత్యుత్త‌మ ర్యాంకులు రావాల‌న్న ఆరాటంతో కొంద‌రు త‌ల్లి, దండ్రులు క‌ళాశాలల్లోని కీల‌క వ్య‌క్తుల‌తో డీల్ కుదుర్చుకున్నారు. దాంతో తామ‌నుకున్న‌ట్లే  పిల్ల‌ల‌కు అత్యుత్త‌మ ర్యాంకులొచ్చాయి.  కాక‌పోతే వ‌చ్చిన ర్యాంకులే వాళ్ళ కొంప‌లు కూల్చాయి. పిల్ల‌ల సామ‌ర్ధ్యం తోటి విద్యార్దుల‌కు తెలీకుండానే ఉంటుందా ?  సామ‌ర్ధ్యం లేని విద్యార్ధుల‌కు అత్యుత్త‌మ ర్యాంకులు రావ‌టంతో అంద‌రిలోనూ అనుమానాలు మొద‌ల‌య్యాయి. చివ‌ర‌కు తీగ లాగితే డొంకంతా క‌దిలింది.   కొంద‌రు త‌ల్లి, దండ్రుల ఆరాటం, అత్యాస  ల‌క్ష‌లాది మంది విద్యార్దుల భ‌విష్య‌త్తును దెబ్బ‌తీసింది. చివ‌ర‌కు మొత్తం విద్యావ్య‌వ‌స్ధ మీదే న‌మ్మ‌కం కోల్పోయేలా చేసింద‌న‌టంలో ఎటువంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: