మళ్ళీ బాబే సీఎం...ఎనీ డౌట్స్.. అంటున్నారు మాజీ ఎంపీ సబ్బం హరి. బాబు గెలుపే మోదీ ఓటమంటూ   కొత్త భాష్యం కూడా చెబుతున్నారు. కేంద్రంపై బాబు వీరోచిత  పోరాటం చేస్తున్నారుట. జనం దానిని మెచ్చి 2019లో కూడా  టీడీపీకి జై అంటారట. ఇదీ హరి చెబుతున్న కధ. ఇంతకీ ఈ మాజీ ఎంపీ గారు తాను ఏ పార్టీలో ఇపుడు లేనని అంటున్నారు. ఎందులో చేరేదీ  టైం చూసి చెబుతానంటున్నా ఆయన గారి రూట్ వెరీ క్లియర్. పచ్చ చొక్కా తొడుక్కోవడమే మిగిలిందని సెటైర్లు పడుతున్నాయి. 


ఇంతకీ ఏమన్నారంటే :


ఏపీలో బాబుకు తిరుగులేదుట. నాలుగేళ్ళు బీజేపీతో అంటకాగడం కూడా జనం మేలు కోసమేనట. ఆ విధంగా చేయడం వల్లనే ఆ మాత్రమైనా అభివ్రుధ్ధి జరిగిందట. ఇపుడు బీజేపీతో విడిపోవడం కూడా ఏపీకి ఇంకా మేలట. ఇన్ని వీరోచితమైన పనులు చేసిన బాబుని కాక జనం ఎవరిని నెత్తిన పెట్టుకుంటారని ఆమాయకంగా అడుగుతున్నారీ మాజీ ఎంపీ.


వాళ్ళిద్దరూ ఆ వైపే :


అచ్చం టీడీపీ పలుకులనే హరి కూడా వల్లిస్తున్నారు. బీజేపీతో జగన్, పవన్ అంటకాగుతున్నారని, అది జనం గమనిస్తున్నారని చెబుతున్నారు. మోడీ అంటే ఏపీ ప్రజలకు పీకల మీద వరకూ కోపం ఉందంట. అందువల్ల ఆ పార్టీతో సఖ్యత ఉన్న ఆ ఇద్దరినీ కూడా జనం పక్కన పెడతారట. ఎన్నికల ముందు జగన్ పవన్ పొత్తు పెట్టుకుని ఆనక బీజేపీతో కలుస్తారట. ఈ స్టోరీ కూడా టీడీపీదే.


పోటీ ఖాయం :


వచ్చే ఎన్నికలలో పోటీ చెయడం ఖాయం అంటున్నారీ నాయకుడు. చెప్పిందంతా చెప్పేసి ఏ పార్టీలో చేరుతానో సస్పెన్స్ అంటున్నారు. పవన్, జగన్ పిలిచినా మాట్లాడుతానంటు ఇంకో ట్విస్ట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ కి ఏపీలోనే కాదు. దేశంలోనూ ఫ్యూచర్ లేదంటున్న హరికి బాబులోనే బ్రహ్మాండమైన ఫ్యూచర్ కనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదుగా. మరి తొందరలోనే   తెలుగు  తమ్ముడు కోబోతున్నారుగా. ఎంతైనా హరి కధలు చెప్పడానికే కాదు వినడానికీ బాగుంటాయి.
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: