ఈ మద్య సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయం వైరల్ గా మారడంతో సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు నానా తంటాలు పడుతున్నారు.  తాజాగా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్  లైంగిక వేదింపులు, దోపిడి చేశాడని ఇద్దరు మహిళలు నానా యాగీ చేశారు..ఇది కాస్త వార్తల్లో రావడంతో వైరల్ అయ్యింది. 
TRS MP Balka Suman Sexual Harassment Totally  Fake - Sakshi
అయితే తనకు ఏమీ తెలియదని కావాలనే కొంత మంది ఇలా చేశారని పోలీసులకు క్లారిటీ ఇచ్చారు బాల్కా సుమన్.   కాగా, టీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మంచిర్యాల సీఐ మహేష్‌ శుక్రవారం ఉదయం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.‘ఎంపీ బాల్క సుమన్‌పై వైరల్‌ అవుతున్న లైంగిక వేధింపుల ఘటన అవాస్తవం. 

బాధితులుగా చెప్పుకుంటున్న బోయిని సంధ్య, విజేతలు గతంలోనూ పలువురిని బ్లాక్‌మెయిల్‌ చేసి వేధించినట్లు మా విచారణలో వెల్లడైంది.  బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లోనూ వారిపై కేసులు పెట్టారు. ఎంపీని ఉచ్చులో బిగించి, బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు గుంజడానికి వారు యత్నించారు.

 అందులో భాగంగానే ఎంపీ కుటుంబ సభ్యుల ఫోటోను నిందితులు మార్ఫింగ్‌ చేసి ఆన్‌లైన్‌లో సర్క్యూలేట్‌ చేశారు’ అని సీఐ మహేష్‌ వెల్లడించారు. సంధ్య, విజేతలపై ఐపీసీ 420 , 292ఏ  , 419 , 506 సెక్షన్ల కింద కేసులు పెట్టాం..’ అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: