పోరాట యాత్ర లో భాగంగా పవన్ కళ్యాణ్ జగన్ కు మరియు చంద్ర బాబు కు సవాలు విసిరినాడు. అయితే ఆ సవాలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, పవన్ కళ్యాణ్ రైల్ రోకో చేస్తారుట దానికి సీఎం చంద్ర బాబు మరియు జగన్ ఇద్దరు కలిసి రావాలంటా... అయితే ఇక్కడ వచ్చిన సమస్యంతా పవన్  కళ్యాణ్ సవాలును నమ్మడం ఎలా..! మాట మీద నిలబడటం పవన్ కళ్యాణ్ జాతకం లోనే లేదు. మధ్యలోనే కాడిని వదిలేస్తాడు. తాడూ బొంగరం లేకుండా తిరుగుతున్న పవన్ కల్యాణ్ లాంటి సినిమా నటుడు.. ఏదో నాలుగు విజిల్స్, అరుపులు కోసం ఆశపడి ‘ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.. అని గొంతు చించుకోగానే.. ముఖ్యమంత్రి తన పదవిని, ప్రతిపక్ష నేత తన దీక్షని వదులుకుని వచ్చేస్తారా? పవన్ ఛాలెంజ్ చాలా హాస్యాస్పదంగా ఉంది.

Image result for pawan kalyan janasena

తెలుగుదేశం కావొచ్చు, వైఎస్సార్ కాంగ్రెస్ కావొచ్చు.. వారి ప్రయత్నాలు, వారి పోరాటాలు వారు చేసుకుంటూనే ఉన్నారు. నోరు మెదపకుండా కూర్చుంటున్నది పవన్ ఒక్కడే కాబట్టి.. నీ వైఖరి ఏంటో చెప్పమన్నారు.. అంతే! కేంద్రాన్ని నిందించడంలేదని, విశాఖ జోన్, కడప ఉక్కు లాంటి అంశాల గురించి పోరాడడం లేదని తన మీద ప్రత్యర్థి పార్టీల వారు చేస్తున్న విమర్శలకు పవన్ కల్యాణ్ కు చిర్రెత్తుకొచ్చినట్లుంది. తన పోరాటయాత్రలో భాగంగా ఇవాళ పవన్ మాట్లాడుతూ.. తెదేపా, వైకాపా అధినేతలు చంద్రబాబు, వైఎస్ జగన్ లకు బహిరంగ సవాలు విసిరారు.

Image result for pawan kalyan janasena

అయినా అసలు పవన్ కల్యాణ్ సవాళ్లను నమ్మడం ఎలాగ? అనేది ఇప్పుడు ప్రజలకు కలుగుతున్న సందేహం. తెదేపా, వైకాపాలకు దమ్ముంటే అవిశ్వాసం పెట్టండి అని ఆయన గతంలో సవాలు విసిరారు. మీకు దమ్ముంటే పెట్టండి.. నేను స్వయంగా ఢిల్లీ వచ్చి రాహుల్ గాంధీ తో కూడా మాట్లాడి.. దానికి అవసరమైన మద్దతు సమీకరిస్తా అని కూడా సవాలులో నొక్కి వక్కాణించారు. ఆ సవాలును వైకాపా స్వీకరించింది. తొలుత మద్దతివ్వడానికి కూడా భయపడినా... ఆ తర్వాత పరువుపోతుందని భయపడి తెదేపా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఇంతకూ పవన్ ఏం చేశారు. ఆ తర్వాత నోరు మెదపకుండా మౌనం పాటించారు. సవాళ్లన్నీ గాలికి కొట్టుకుపోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: