పవన్ కళ్యాణ్ ఉత్రరాంధ్ర టూర్ ఇవాళతో ముగుస్తోంది. మే 20న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభించిన  ప్రజా పోరాట యాత్రకు విశాఖ నడిబొడ్డున ఆర్కే బీచ్ లో కవాతుతో ఎండ్ కార్డ్ పడనుంది. మూడు జిల్లాలలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పవన్ మీటింగులు పెట్టారు. చివరగా విశాఖ సిటీలో వేలాది మంది జన సైనికులతో భారీ కవాతుని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు కవాతు మొదలవుతుంది. దీనికి సంబంధించి మూడు జిల్లాల నుంచి జన సైనికులు పెద్ద సంఖ్యలో బీచ్ వద్దకు చేరుకున్నారు.


ఏం చెప్తారు :


పవన్ ఇంత వరకు తన మీటింగులలో లొకల్ సమస్యలనే టచ్  చేశారు తప్ప, ఏపీలో కీలకమైన అంశాల జోలికి పోలేదన్న విమర్శలు ఉన్నాయి.  ప్రత్యేక హోదా, విభజన హామీలు, బాబు సర్కార్ అవినీతి ఇలా అనేక విషయాలలో పవన్ పెద్దగా రెస్పాండ్ అయ్యింది లేదు. ఆయన మీద బీజీపీ ముద్ర ఉంది. జగన్ తో కలిపి కట్టేస్తున్నారు. వీటన్నిటికీ కవాతులో జవాబు దొరుకుతుందని అంటున్నారు


దీక్షలకు డేట్ ఫిక్స్ ?


విశాఖ రైల్వే జోన్ కోసం దీక్ష చేస్తానని పవన్ అన్నారు. అంతకు ముందు ప్రత్యేక హోదా పైనా అమరణ దీక్ష అన్నారు. ఇపుడు కవాతులో వీటికి సంబంధిని డేట్, టైం, ప్లేస్ వంటివి పవన్ ప్రకటించి ప్రత్యర్ధులకు షాక్ ఇస్తారా అన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఉత్తరాంధ్ర పోరాటంపైనా ఆయన అజెండా  డిక్లేర్ చేస్తారా అన్నదీ కవాతు లోనే చూడాలి.


పొత్తుల సంగతేంటి :


పవన్ ఇంతవరకూ అఫీషియల్ గా ఫలానా పార్టీతో పొత్తు అని ఎక్కడా చెప్పలేదు  లెఫ్ట్ పార్టీలు మాత్రం పవన్ తో జత కడతామంటున్నాయి. మరో వైపు జగన్ తో పవన్ కలసి పోటీ అంటున్నారు. ఈ రకమైన ప్రచారానికి పవన్ ఫుల్ స్టాప్ పెడుతూ స్పష్టమైన పొలిటికల్ రూట్ మ్యాప్ ఇస్తారా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర టూర్ తరువాత తూర్పు గోదావరి లో యాత్ర ఉంటుందని జనసేన వర్గాలు అంటున్నాయి. దాని విషయంలోనూ పవన్ ఏమైనా షెడ్యూల్ ప్రకటిస్తారా అన్నదీ చూడాలి. మొత్తానికైతే పవన్ ఫ్యాన్స్ మంచి జోష్ మీద ఉన్నారు. తమ అధినేత ఈ వేదిక మీద నుంచే అందరికీ షాక్ ట్రీట్మెంట్ ఇస్తారని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: