రాజకీయాలలో పడని వారు పక్కనుంటే ఎంత పెద్ద పార్టీలోనైనా  ఎంతో ఇరుకుగా అనిపిస్తుంది, అన్నీ కాలాలూ వేసవి అయిపోయి ఉక్కబోత ఇక్కట్లూ వస్తాయి. ఆ పడని వారు అలా పక్కకు తొలగిపోతే ఎంత హాయి ఈ లోకం అనిపిస్తుంది. సరిగ్గా ఇదే అనుభవాన్ని విశాఖ జిల్లా సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఏమి హాయిలే హలా అని సాంగులూ సింగుతున్నారు. ఇదంతా ఉప్పూ నిప్పూ లాంటి గంటా, అయ్యన్నల స్టోరీలో లేటెస్ట్ ఎపిసోడ్.


టీడీపీతో కటీఫ్ :


గత కొన్ని రోజులుగా మంత్రి గంటా పార్టీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పెద్దగా కార్యక్రమాలలోనూ కనిపించడంలేదు. ఆయన ఏంచేయబోతారన్నది ఇదమిద్దంగా తెలియకపోయినా టీడీపీతో కటీఫ్ కే రెడీ అంటున్నారని టాక్ నడుస్తోంది. దీంతో రెండో మంత్రి, పార్టీలో ఆయన గారి ప్రత్యర్ధి అయ్యన్నలో ఎక్కడ లేని  జోష్ వచ్చేసింది. కలివిడిగా విశాఖ సిటీలో తిరిగేస్తూ తెగ హుషార్ చేస్తున్నారు. పార్టీ నాయకులతో మీటింగులు పెడుతూ హవా చలాయిస్తున్నారు. 


బౌండరీలు దాటేసి మరీ :


జిల్లలో గంటా, అయ్యన్న గ్రూప్ పాలిట్రిక్ ని తట్టుకోలేక చంద్రబాబు ఇద్దరికీ మధ్య బౌండరీలు గీసేసారు. జిల్లాలో అయ్యన్న, సిటీలో గంటా పవర్ చూపించాలి. ఎవరి హద్దులలో వాళ్ళుండాలి. మరిపుడు గంటా వారు సైడ్ అవుతున్నారన్న టాక్ రావడంతోనే అయ్యన్న బౌండరీలు దాటేసి మరీ సిటీలోకి ఎంటరైపోయారు. మీడియాకు ఇంటర్వ్యూలు, మీటింగులు ఇలా బిజీ అవుతున్నారు. 


గొడవల్లేవంటూనే :


గంటాతో గొడవలు లేవంటూనే సెటైర్లు వేస్తున్నారు. తను మళ్ళీ నర్శీపట్నం నుంచే పోటీ చేస్తానని, మిగతా వారిలా నియోజకవర్గాలను మార్చనని చెప్పడం ద్వారా గంటాకే పంచ్ ఇచ్చేశారు.  వారసత్వాలు కాదు, టాలెంట్ ఇంపార్టంట్, నా కొడుకుకి టికెట్ ఇచ్చినా అదే చూడాలంటూ పరోక్షంగా గంటా రాజకీయ వారసుడిపైనా కౌంటర్లేశారు. మొత్తంగా చూస్తే గంటా కాసింత సైడ్ అవడంతోనే మంత్రికి ఎక్కడలేని పొంగూ వచ్చేసిందేమో.


ఆ బ్యాచ్ హ్యాపీనా :


గంటా యాంటీ బ్యాచ్ గా టీడీపీలో గట్టి స్టాంప్ ఉన్న ఆ బ్యాచ్ ఇపుడు ఫుల్ ఖుషీగా ఉందంటున్నారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి, పార్టీలో మరో పెద్దాయన, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు గంటా ఎపిసోడ్ తరువాత హ్యాపీ అంటున్నారు. ఆయన బయటకెళ్ళినా ఏం కాదు అంటున్నారు. టీడీపీ క్యాడర్ బేసెడ్ పార్టీ అని, మళ్ళీ గెలిచేస్తాం అని డేరింగ్ గా చెబుతున్నారు. బట్ గంటా లేని టీడీపీ 2009లో ఓడిపోయిన మాటర్ ని మాత్రం కావాలనే పక్కన పెట్టేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: