ఆ మద్య ఓ తెలుగు సినిమాలో హీరోయిన్ ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది..కానీ అనుకోని పరిస్థితుల్లో వేరొక వ్యక్తితో పెళ్లి అవుతుంది.  కానీ తన మనసు నిండా ప్రేమించిన యువకుడే ఉండటంతో ఆమె భర్తకు అసలు విషయం చెబుతుంది.  దాంతో భర్త కుంగిపోకుండా తన అత్తమామలను ఒప్పించి హీరోయిన్ ప్రేమించిన యువకుడితో దగ్గరుండి పెళ్లి జరిపిస్తాడు. అయితే ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.  ఒక వేళ యువతి వేరే యువకుడిని ప్రేమించినా..పెద్దల బలవంతంతో వారు కుదిర్చిన వివాహం చేసుకొని జీవితాంతం కాంప్రమైజ్ అవుతుంటారు. 

తాజాగా బింజిలపుట్ గ్రామానికి చెందిన శ్యామలేశ్వరి, మొహొకుమార్ గ్రామానికి చెందిన భవానీ శంకర పట్నాయక్‌కు ఈ నెల 2వ తేదీన వివాహం జరిగింది. అత్తగారింటికి వెళ్లిన తర్వాత మొదటి రాత్రి  ‘నీతో పెళ్లి ఇష్టం లేదు, నేను వేరే అబ్బాయిని ప్రేమించాను…’ అని కన్నీరు పెట్టుకుంటూ చెప్పింది...దాంతో మొదట భర్త కామెడీ అనుకున్నాడు..కానీ అది నిజమని తెలిసిన తర్వాత కాస్త షాక్ తిన్నాడు.  అయితే విషయం విన్న కోపం తెచ్చుకోకుండా..ఎవరికీ ఫిర్యాదు చేయకుండా మంచి మనసుతో ఆమెకు వివాహ బంధం నుంచి స్వేచ్ఛ కల్పించి, కోరుకున్న వాడిని పెళ్లిచేసుకొమ్మన్నాడు.

ఇష్టం లేని కాపురం ఎందుకులే అంటూ వారు కూడా తెగతెంపులకు ఒప్పుకున్నారు. పెళ్లికి ఇచ్చిన కట్నకానుకలతోపాటు కూతురునూ తీసుకొని వెళ్లిపోయారు.శ్యామలేశ్వరి  ప్రియుడు మనోతోష్‌ను వివాహం చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. చేసేదేమి లేక వారు కూడా ఒప్పుకున్నారు.  నందపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: