ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ లోకి వెళ్లడం దాదాపు ఖాయం అయిపోయింది. నెల్లూరు లో ఆనం బలమైన నాయకుడు అని చెప్పవచ్చు. అయితే నెల్లూరు లో టీడీపీ పరిస్థితి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నెల్లూరు పరిధిలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉంటె 7 వైసీపీ కైవసం చేసుకున్నది. మిగిలిన 3 టీడీపీ కైవసం చేసుకున్నది. అయితే ఇప్పడూ ఆనం కూడా వైసీపీ లోకి వెళుతున్నాడంటే టీడీపీ ని నెల్లూరు లో ఆ దేవుడు కూడా కాపాడలేడు. 

Image result for anam ramanarayana reddy

చంద్రబాబును నమ్మి పార్టీలోకి వచ్చిన పాపానికి ఇక్కడ ఇమడలేక, కుమ్ములాటలు భరించలేక, అవమానాలను ఓర్వలేకపోతున్న అనేకమంది నాయకులు.. ఇప్పుడు ఎగ్జిట్ గేట్లు వెతుక్కుంటున్నారు. అలాంటి వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారం ఇవాళ్టికి తేలిపోయింది. చాలారోజుల నుంచి ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే పుకారు నడుస్తోంది.

Image result for anam ramanarayana reddy

కాగా, శుక్రవారం నాడు హైదరాబాదు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆనం, వైఎస్ జగన్ ను ప్రత్యేకంగా కలిసి పదినిమిషాల పాటు మాట్లాడారు. తెలుగుదేశాన్ని వీడి ఆనం వైకాపాలో చేరడం ఇక దాదాపుగా ఖరారైనట్లే. కాకపోతే.. ఇలాంటి అసంతృప్తి వాదులు తెలుగుదేశంలో ఎందరున్నారనేదే చర్చనీయాంశంగా ఉంది. వైకాపా నుంచి తెదేపాలోకి వెళ్లిన కొందరు ఎమ్మెల్యేలు కూడా కొన్నాళ్ల కిందట పాదయాత్రలో జగన్ సమక్షంలో తిరిగి పార్టీలోకి రావాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: