వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేదేమిటి. ఓ స్వచ్ఛమైన చిరునవ్వు. ఆ చిరునవ్వే మన ముందు కదలాడుతుంది.  పంచె కట్టుతో తెలుగుదనానినికి ప్రాణం పోసినట్టు రాజసంగా నిలిచిన రూపం. ఆయన చనిపోయి అప్పుడే 9 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆత్మీయంగా ప్రతి ఒక్కరినీ పిలిచిన పిలుపు. అవును వైయస్ఆర్ ఓ మరపురాని జ్ఞాపకం. ప్రతి తెలుగు వానికి ఆయన చిరునవ్వుతో ఓ బంధం పెనవేసుకునే ఉంది.  ఈ రోజు వైయస్ఆర్ 69 వ జయంతి. విచిత్రంగా అదే రోజున ఆయన తనయుడు కూడా ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే సంకల్పంతో  చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర కూడా ఈ రోజు 2500 కి మీ పూర్తి కావటం విశేషం. ప్రజా సంకల్పయాత్ర ఆరంభమై ఎనిమిది నెలలు దాటింది. ఆ పాదయాత్రికుని యాత్ర ఇప్పటికి పది జిల్లాలను దాటుకుని పోతోంది.

Image result for వైఎస్ జయంతి

ప్రతికూలతలను కూడా చిరనవ్వుతో అధిగమిస్తూ :
ప్రజల మధ్య ఉన్నప్పుడు వైయస్ నవ్వితే అది పూల వర్షంలా ఉంటే, అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయన నవ్వు సింహగర్జనలా ఉండేది. ప్రతిపక్ష పార్టీ నాయకులను కూడా చిరునవ్వుతోనే ఎదొర్కోవడం వైయస్ ఆర్ కు మాత్రమే సాధ్యం. విమర్శలు, ఆరోపణలకు సైతం ఛలక్తులతో సమాధానం ఇచ్చే నాయకుడిని చూసి అసెంబ్లీ ఆశ్చర్యపోయేది. ఒక్కో సందర్భంలో చంద్రబాబు వైయస్ఆర్ నవ్వును చూసి తట్టుకోలేక ఆవేశపడిపోయేవారు. ప్రతిపక్ష నేతను తన చిరునవ్వుతో ఉడికిస్తూ, కవ్విస్తూ మధ్య మధ్యలో వాస్తవాలను వెల్లడించి తన చతురత చాటుకున్న చాణుక్యుడు వైయస్ఆర్. ఆయన తీరుకు సభ అంతా నవ్వుల పూవులు పూయడాన్ని పార్టీలకు అతీతంగా నాయకులంతా గుర్తు చేసుకుంటూంటారు. 


కష్టకాలంలోనూ చెదరని నవ్వు :
వైయస్ఆర్ జీవితం పూల బాట కాదు. ఎన్నో ఏళ్లు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు. ఆ సమయంలోనే ప్రజల కష్టాలు చూసి చలించిపోయారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభించి, కన్నీళ్లతో ఎదురు చూస్తున్న ప్రజలకు తానున్నానే భరోసా కల్పించారు. మండుటెండలు, హోరు గాలులు, వర్షాలూ ఏవీ ఆయన పాదయాత్రకు ఆటంకం కాలేకపోయాయి. అనారోగ్యం పాలైనా సరే యాత్రకు విశ్రాంతి ఇవ్వలేదు. ప్రజలు ఇన్ని బాధలను సహిస్తున్నప్పుడు, వారిని ఓదార్చడానికి ఈ మాత్రం కష్టపడలేమా అంటూ చిరునవ్వుతో ముందుకే సాగారు వైయస్ఆర్. 


తండ్రి బాటలో తనయుడు:
ఏది ఏమైనా జగన్ రాజకీయ వ్యూహం రోజు రోజుకు పరిణతి చెందుతుందనే అనిపిస్తుంది. కొన్ని రకాల వ్యూహాలు రాజకీయ ఉద్ఘండుడు చంద్రబాబు నివ్వెరపరుస్తున్నాయి. అంతెందుకు జగన్ రెచ్చగొట్టే ధోరణితో చంద్రబాబుకి సవాలు విసిరి బిజెపి తో తెగదెంపులు చేసుకునేలా చేయటంలో కూడా జగన్ పాత్ర లేకపోలేదు. రాజకీయ వ్యూహాలు ఛేదించటంలో జగన్ ఆయన తండ్రిని అనుసరిస్తున్నారని చెప్పటంలో ఆశ్చర్యమేమీ లేదు. 
Image result for ys jagan padayatra
జగన్ అనుసరిస్తున్న వ్యూహం 2019 ఎన్నికలలో ఆయనకి ఏ విధంగా ఓట్లు తెచ్చిపెడుతుందో తెలియదని కానీ చంద్రబాబుని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టడంలో మాత్రం వియజయవంతం అవుతున్నాడు. తాను చేస్తున్న పాదయాత్రలో కూడా పార్టీలో భారీగానే చేరికలు ఉంటున్నాయి. పార్టీ కార్యకర్తలలో కూడా పాదయాత్ర పొడవునా ఉత్సాహం నింపుతున్నాడు. రాజమండ్రి రైల్వే బ్రిడ్జి పైన చేసిన పాదయాత్ర, కృష్ణ గోదావరి బ్రిడ్జి పైన చేసిన పాదయాత్ర ప్రజల్లో ఆయనకున్న ఛరిష్మాని తెలియజేస్తున్నాయి. ప్రజలు తండోపతండాలుగా వచ్చినంత మాత్రాన ఓట్లు పడేవేమో కానీ ఆయన చేస్తున్న ప్రసంగాలకు మాత్రం జనాల నుండి విపరీతంగానే స్పందన రావటం గమనార్హం. మరీ ఆ జన స్పందన ఓట్లు తెచ్చిపెడుతుందా ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: