ప్రపంచానికే నాగరికత నేర్పిన భారత్ లో ఇప్పుడు  కుక్కమూతి పిందెలు పుడుతున్నాయి. అత్యంత మధురమైన చెరకు తుద వెన్ను పుట్తినట్లి. దేశ గౌరవం గంగలో కలుస్తు న్న ఈ తరుణం లో  ఇప్పుడు న్యాయం స్థానం జూలు విదిల్చి ఇచ్చిన తీర్పే నేడు మైననర్లపై లైంగిక దాడి చెసేవాళ్ళ గుండెల్లో ఝలదరింపులు పుట్టిస్తుంది. 12ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణ శిక్ష విధించాలంటూ గతేడాది డిసెంబరులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవంగా బిల్లును పాస్ చేసింది. 
Image result for death sentence to rapist of minor in madhya pradesh
ఈ బిల్లు ను రాష్ట్రపతి ఆమోదించడంతో ఏప్రిల్ 21న చట్టం రూపం దాల్చింది. 

మధ్యప్రదేశ్ రెహిల్‌ జిల్లా ఖమారియా గ్రామంలో ఒక ఆలయంలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. మే 21న పటేల్‌ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడ్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు “పోక్సో-యాక్ట్‌”  కింద కేసు నమోదు చేశారు. 
Related image
తాజాగా నిందితుడిని దోషిగా తేల్చిన సాగర్ జిల్లా కోర్టు అతడికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. అంతేకాదు త్వరితగతిన శిక్షను అమలు చేయాలని పోలీస్‌ శాఖ ను కోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్‌ లో చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దోషికి ఉరిశిక్ష పడడం ఇదే తొలిసారి. 
Image result for death sentence to rapist of minor in madhya pradesh
కోర్టు తీర్పుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు నేరగాళ్లకు చెంపపెట్టు అవుతుందని, మైనర్ల పై అఘాయిత్యాలకు పాల్పడే వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. హోమంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇదో చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించారు. ఇకపై అత్యాచారాలకు పాల్పడే వారికి వెన్నులో వణుకుపుట్టాలన్నారు.

Image result for death sentence to rapist of minor in madhya pradesh

మరింత సమాచారం తెలుసుకోండి: