వైసిపి అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. అయితే నేడు జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన తన తండ్రి పుట్టినరోజు నాడే తన పాదయాత్ర 2500 కిలోమీటర్లు దాటిన నేపథ్యంలో వైయస్ జగన్ తన హర్షం వ్యక్తం చేశారు ట్విట్టర్ ద్వారా.
Related image
ప్రస్తుతం జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో మొన్నటివరకు భగభగ మండే ఎండల్లో తాజాగా వర్షంలో నిరంతరాయంగా ఎక్కడా కూడా ఆగకుండా కొనసాగుతుంది. అయితే ఈ క్రమంలో తన పాదయాత్ర 2500 కిలోమీటర్లు దాటడంతో జగన్ మైలురాయికి గుర్తుగా జగన్‌ ఓ మొక్కను నాటారు.
Related image
నేడు దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 69వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన ట్విటర్‌లో స్పందించారు.
Image result for jagan ysr
తండ్రి వైఎస్సార్‌ జయంతి రోజే నేను చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 2500 కిలోమీటర్ల అరుదైన మైలురాయిని చేరుకోనుండటం కేవలం యాధృచ్ఛికమే కాదు, ఏపీ ప్రజలతో పాటు వైఎస్సార్‌ ఆశీస్సులు కూడా నాకు ప్రతిబింబించేలా ఉంది. స్వర్గం నుంచి నాన్న ఆశీర్వదించారు. హ్యాపీ బర్త్‌డే నాన్న. ఎల్లప్పుడూ మాకు అండగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు’ అని వైఎస్‌ జగన్‌ ఉద్వేగభరితంగా ట్వీట్‌ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: