పవన్ కళ్యాణ్ తన పోరాట యాత్ర సభలో కొన్ని కామెంట్స్ చేస్తున్నాడు. ఆ కామెంట్స్ లో ఎంత కామెడీ ఉందంటే జనరల్ నాలెడ్జి ఉన్న వారికి ఎవరికైనా అర్ధం అవుతోంది. జగన్ , చంద్ర బాబు నాయుడు కలిసి వస్తే నేను పోరాటానికి సిద్ధం అంటున్నాడు. అస్సలు తానూ పోరాటం చేయాలనుకుంటే జగన్ వస్తే చేస్తాను , బాబు వస్తే చేస్తాను ఇలాంటి చిత్త శుద్ధి లేని మాటలు పవన్ నుంచి రావని చెప్పొచ్చు. 

Image result for pawan kalyan porata yatra

ఇక్కడ పవన్ కల్యాణ్ గమనించాల్సిన విషయం ఒకటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గానీ, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన రెడ్డి గానీ ధూర్తులే అనుకుందాం. రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పనిచేయగల, పోరాడగల తెగువ, ధైర్యం ఉన్న ధీరుడు పవన్ కల్యాణ్ ఒక్కడే అని అనుకుందాం. వారిద్దరికీ చిత్తశుద్ధి లేదు... అనే అనుకుందాం. వారికే గనుక చిత్తశుద్ధి ఉంటే అసలు రాష్ట్రానికి పవన్ కల్యాణ్ అవసరం ఏముంది? వారికి లేదనే ఉద్దేశంతోనే గదా.. పవన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి రంకెలేస్తున్నది? మరి వారితో ముడిపెట్టి.. ఇలాంటి బుకాయింపు మాటలు, చేతగాని మాటలు మాట్లాడడం ఎందుకు?

Image result for pawan kalyan porata yatra

వారిద్దరూ కలిసి రాకపోవడమే మహదవకాశం అని పవన్ అనుకోవాలి. తనకు దమ్ము, చిత్తశుద్ధి ఉంటే తాను కేసులకు  భయపడకుండా.. తన పార్టీ శ్రేణులతో, ఆయన సూచించిన అద్భుతమైన పరిష్కార మార్గం రైల్ రోకో ను చేయించాలి. వెనుకంజ వేయకూడదు. వాళ్లతో ముడిపెట్టి వాళ్లు కూడా వస్తేనే పోరాడుతా అని అన్నంత కాలం.. పవన్ కల్యాణ్ మోసపూరిత మాటలు చెబుతున్నట్లే భావించాల్సి వస్తుంది 


మరింత సమాచారం తెలుసుకోండి: