పవన్ కళ్యాణ్ తన మాటల తూటాలను, విమర్శల్లో వేడి ని పెంచుతున్నాడు. అచ్చు రాజకీయ నాయకుడి లా మాటల దాడిని పెంచుతున్నాడు. ఇప్పడు లోకేష్ ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నాడు. దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని దొడ్డి దారిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవి చేపట్టడం కాదు. దమ్ముంటే ప్రజా క్షేత్రం లో రావాలని నువ్వు నేను చూసుకుందామని ఓపెన్ ఛాలెంజ్ చేసినాడు. 

Image result for pawan kalyan porata yatra

దొడ్డిదారిన కాకుండా ప్రజాక్షేత్రంలోకి రమ్మని చెప్పండి. నేను జనసేన తరఫున నిలబడతాను. అప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారో?" ఇలా నారాలోకేష్ కు బహిరంగంగా సవాల్ విసిరారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేసే దమ్ములేని వాళ్లు కూడా ముఖ్యమంత్రి పదవి కోరుకుంటున్నారని పవన్ ఎద్దేవా చేశారు. కేవలం తను సినిమా క్రేజ్ తో రాజకీయాల్లోకి రాలేదని, ఏ విషయంపైనైనా మాట్లాడే సబ్జెక్ట్ తో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పవన్.

Image result for pawan kalyan porata yatra

ఏ పాలసీపైనైనా మాట్లాడేందుకు తను సిద్ధమని, ఓవైపు తను ఒక్కడ్నే ఉంటానని, మరోవైపు టీడీపీ నాయకులంతా రండి చూస్కుందాం అంటూ మరో సవాల్ విసిరారు. "నన్ను సినిమా వాడని విమర్శిస్తున్నారు. నాతో చర్చకు రండి, నేనేంటో చూపిస్తా. హెల్త్ పాలసీ మీద మాట్లాడదామా, న్యూక్లియర్ పాలసీ, పర్యావరణం, వ్యవసాయం, గనులు, పంచాయతీ రాజ్.. ఇలా ఏ పాలసీ మీద మాట్లాడాలో చెప్పండి.



మరింత సమాచారం తెలుసుకోండి: