ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల మోకాలి లోతు నీరు నిలిచిపోయింది.  ముంబాయి నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రాత్రి నుండి విరామం లేకుండా కురుస్తున్న వర్షంతో రవాణా వ్యవస్థ,జన జీవనం పూర్తిగా స్థంభించింది. కాగా రానున్న 72 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నాలా సోపురా ప్రాంతంలో భారీ వర్షం కారణంగా వరద రావడంతో పలు వాహనాలు కొట్టుకుపోయాయి.

అపార్ట్ మెంట్లు, షాపింగ్ మాల్స్ సెల్లార్లలోకి నీరు చేరి వాహనాలు నీట మునిగాయి. అటు మిగిలిన ప్రాంతాల్లో కూడా రోడ్లపై నీరు నిలిచింది.   అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాన రన్‌వే వర్షం నీటితో నిండిపోవడంతో దానిని మూసివేశారు. ఇక్కడ కేవలం రెండో రన్‌వే మాత్రమే పనిచేస్తోంది.   ప్రాథమిక సమాచారం ప్రకారం ముంబాయి, మహారాష్ట్రలోని మిగతా ప్రాంతాల్లోనూ, గోవాలోనూ భారీవర్షాలు కొనసాగుతాయి.
Image result for ముంబాయి వర్షం
రాగల 24 గంటల్లో కొంకణ్‌ ప్రాంతమంతా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు భావిస్తున్నారు.  రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. అయితే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది.  రోడ్డు, రైల్వే రవాణాను ఎప్పటికపుడు సమీక్షిస్తున్నామని నియంత్రణాధికారులు తెలిపారు. ప్రస్తుతం కురిసిన వర్షపాతం గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలాఎక్కువ అంటున్నారు పౌర అధికారులు అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: