రెండేళ్ల కిందటి ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ వైపు నిందితుల జాబితా పెరిగిపోతుండగా.. మరోవైపు లీకైన ప్రశ్నపత్రంపై శిక్షణ పొందిన విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది.  ఎంసెట్‌ పేపర్‌ లీకేజీ కుంభకోణంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని నారాయణ, శ్రీ చైతన్య కార్పొరేట్‌ కళాశాలల వ్యవహారాలపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్‌ చేశారు.
Image result for ఎంసెట్ లీకేజ్
అయితే ఎంసెట్ లో భారీ స్కామ్ జరిగిందని..ఈ స్కాం విలువ ఎంత? ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.100 కోట్లు. ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా జప్తు చేసిన సీఐడీ.. కుంభకోణం విలువ వంద కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని చెబుతోంది. కొన్నేళ్లుగా నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలు బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ విద్యను శాసించే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ రాసే విద్యార్థులు అత్యధిక శాతం ఈ 2 కాలేజీల నుంచే ఉంటున్నారని పేర్కొన్నారు.
Image result for ఎంసెట్ లీకేజ్
ఒక్కో విద్యార్థితో రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు లీకేజీ మాఫియా వసూలు చేయగా.. కొంత మంది తల్లిదండ్రులు సైతం తమ పిల్లలతోపాటు మరికొందరు విద్యార్థులను క్యాంపునకు పంపించి లక్షల్లో దండుకున్నారు. ఎట్టకేలకు మొత్తం వ్యవహారం బట్టబయలు కావడంతో వసూలు చేసిన డబ్బంతా సీఐడీ సీజ్‌ చేస్తూ వెళ్తోంది

. త్వరలోనే ఆ మొత్తం రూ.వంద కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.   ఈ కాలేజీల నిర్వాకాన్ని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు నియంత్రించలేకపోతున్నాయన్నారు. ఎంసెట్‌ పేపర్‌ లీకేజీ జరిగిన రెండేళ్ల తర్వాత పాపం పండి కార్పొరేట్‌ కాలేజీ డీన్‌ ఒకరు అరెస్టయ్యారని ఆయన పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: