శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న కత్తి మహేష్‌పై హైదరాబాద్‌ పోలీసులు బహిష్కరణ వేటు వేశారు. రాత్రి నోటీసులు అందజేశారు. తమ అనుమతి లేకుండా హైదరాబాద్‌కు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. వ్యక్తీకరణ ప్రాథమిక హక్కే అయినప్పటికీ... ఇష్టానుసారం మాట్లాడుతూ, సమాజంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేవారిని ఉపేక్షించబోమని, కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. 
Image result for కత్తి మహేష్ బహిష్కరణ
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న సినీ క్రిటిక్ కత్తి మహేష్ ను ఆరు నెలల పాటు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ ఆరు నెలల్లో కత్తి మహేష్ హైదరాబాదులో అడుగుపెట్టేందుకు యత్నిస్తే... అది నేరమవుతుందని తెలిపారు. మూడేళ్ల జైలు శిక్షకు ఆయన అర్హులవుతారని చెప్పారు. ఏ రాష్ట్రానికి చెందినవారైనా హైదరాబాదులో ప్రశాతంగా బతకొచ్చని... కానీ, సమాజంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకోబోమని డీజీపీ తెలిపారు.

ఇలాంటి వ్యక్తులకు సహకరించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉంటే..కత్తిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు శ్రీరాముని కత్తి మహేష్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు పూనుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లుతుందని ఆయను హౌజ్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా తెలంగాణలో శాంతిభద్రతలు బాగున్నాయని... ఇకపై కూడా రాష్ట్రం శాంతియుతంగానే ఉండాలని ఈ నిర్ణంయ తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: