భారీ వర్షాలతో జపాన్‌ అతలాకుతలం అవుతోంది. కుండపోత వర్షం కారణంగా శనివారం భారీ వరద పోటెత్తడంతో 50 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.   గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో వరదల కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 100కు చేరినట్లు జపాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో 87 మందిని గుర్తించామని, మరో 13 మంది మృతుల వివరాలు తెలియలేదన్నారు.
50 killed, dozens missing as torrential rain pounds Japan - Sakshi
హిరోషిమాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో పలువురు చనిపోయారు. ఎహిమే, క్యోటోల్లోనూ వరద పోటెత్తడంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 50.8 లక్షల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం దాదాపు 48,000 మంది పోలీసులు, ఆర్మీ, అగ్నిమాపక శాఖ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.   పలువురు గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. నదులు పొంగడంతో తీరప్రాంతాల్లో ఉన్న చాలా మందిని ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.

"ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి వర్షాలను చూడలేదు" అని వాతావరణ అధికారులు చెప్పారు.  చనిపోయిన వారి మృతదేహాల కోసం, గల్లంతైనవారి కోసం సహాయ బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో కొన్ని చోట్ల వంతెనలు కూలిపోయాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యల్లో భాగంగా హెలికాప్టర్లను రంగంలోకి దింపారు.

ఇప్పటి వరకు దాదాపు 9లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. 2004 జపాన్‌లో మళ్లీ ఇంతటి తీవ్రస్థాయిలో వరదలు సంభవించడం ఇదే తొలిసారని వెల్లడించారు.  శనివారం రాత్రి 8.23 గంటలకు(స్థానిక కాలమానం) టోక్యోకు సమీపంలో రిక్టర్‌ స్కేలుపై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.




మరింత సమాచారం తెలుసుకోండి: