దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు సోమవారం నాడు తుదితీర్పును ఇచ్చింది.  దేశ రాజధాని న్యూఢిల్లీలో 2012న జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులోని నింధితులకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు సుప్రీం కోర్టు తీర్పు తెలిపింది. అయితే మరణశిక్ష కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. ఉరిశిక్షే దోషులకు సరైనదంటూ సుప్రీం కొట్టి వేసింది.
Image result for supreme court of india
డిసెంబరు 16, 2012 న బస్సులో తన స్నేహితుడితో ప్రయాణిస్తోన్న వైద్య విద్యార్థినిపై ఓ మైనర్ సహా ఆరుగురు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, ఆమె మర్మంగాలపై ఇనుప రాడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి డిసెంబర్ 29న ప్రాణాలు విడించింది. ఈ కేసులో ప్రధాని దోషి రామ్ సింగ్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
Image result for supreme court of india nirbhaya
సెషన్స్ కోర్టు తీర్పుపై దోషులు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వీరికి చుక్కెదరయ్యింది. దీంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై గతేడాది మే 5 న వాదనలు విన్న జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతి, అశోక్ భూషణ్‌ల త్రిసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.  కాగా, నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులోని నింధితులకు మరణశిక్షే సరైనదంటూ సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.
Image result for supreme court of india nirbhaya
ముఖేస్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్త అనే వ్యక్తులు ఈ కేసులో నింధితులుగా ఉన్నారు. అయితే 2013 జనవరి 23న ఓ వ్యక్తిని మైనర్‌గా జువైనల్ బోర్డు తేల్చింది. మిగిలిన ముగ్గురికి మరణశిక్ష విధించింది. గతంలోనే ట్రయల్ కోర్టు, హైకోర్టు తీర్పులో నింధితులకు ఉరిశిక్షను ఖరారు చేశాయి.  నింధితులు క్షమించరాని నేరం చేశారని, ముఖేష్, పవన్, వినయ్ అనే ముగ్గురు నింధితులకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు సుప్రీం తీర్పు వెలువరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: