వైసీపీ సీనియర్ నాయకుడు, విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అధినేత జగన్ షాక్ ఇవ్వబోతున్నారా. ఆయన చిర కాల ఆశలకు గండి కొడుతున్నారా. జిల్లా రాజకీయాలను గమనిస్తే అవుననే సమాధానం వస్తోంది. బొత్స ప్రత్యర్ధులంతా ఏకమై ఆయనను రాష్ట్ర రాజకీయాలకు దూరం చేయాలంకుంటున్నట్లు భోగట్టా. జగన్ సైతం బొత్సను సీనియర్ సిటిజన్ గా భావిస్తూ ఆయన సేవలను జాతీయ స్థాయిలో యూజ్ చేసుకోవాలనుకుంటున్నారుట.


పార్లమెంట్ సీటు బొత్సకే :


ప్రతిష్టాత్మకమైన విజయనగరం పార్లమెంట్ సీటు నుంచి వచ్చే ఎన్నికలలో బొత్సను పోటీ చేయించాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. మళ్ళీ ఆ సీటు నుంచి కేంద్ర మాజీ మంత్రి పీ అశోక్ గజపతిరాజు పోటీకి దిగే అవకాశాలు కనిపిస్తూండడంతో సరైన అభ్యర్ధిగా బొత్సను సెలెక్ట్ చేసారంటున్నారు. విజయనగరం రాజకీయాలలో డీ అంటే డీ అనే స్థాయి కలిగిన అశోక్, బొత్సలను ఒకే రాజకీయ యుధ్ధానికి వైసీపీ సిధ్ధం చేస్తోంది. 


బొత్స మనసు ఇటువైపు :


బొత్స మాత్రం అధినేత నిర్ణయానికి ససేమిరా అంటున్నట్లు టాక్. తాను ఎమ్మెల్యేగా పోటీకి దిగుతానని ఆయన సన్నిహితులతో చెబుతున్నారు. పోయిన ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి బొత్స బరిలోకి దిగేందుకు ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసేసుకున్నారు. ఈసారి వైసీపీ కచ్చితంగా పవర్లోకి వస్తుందని, కీలకమైన మంత్రిత్వ శాఖను దక్కించుకోవడం ద్వారా జిల్లాలోనూ. ఏపీలోనూ చక్రం తిప్పాలన్నది భొత్స ప్లాన్ గా కనిపిస్తోందొ.


అక్కడ తీవ్ర పోటీ :


బొత్స కోరుతున్న చీపురుపల్లి సీటుకు పోటీ గట్టిగానే ఉంది. వైసీపీ జిల్లా మాజీ ప్రెసిడెంట్, మాజీ జిల్లాపరిషత్ చైర్మన్ బెల్లాల చంద్రశేఖర్ ఆ సీటును ఆశిస్తున్నారు. ఆయన  అధిష్టానం వద్ద తన పలుకుబడి ఉపయోగించుకుని గట్టిగా డిమాండ్  చేస్తున్నారు. జగన్ సైతం చంద్రశేఖర్ కు  టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. బొత్స అంత సులువుగా ఈ సీటు వదులుకుంటారా అన్నది చూడాలి.


గ్రాండ్ గా బర్త్ డే :


బొత్స జన్మదిన వేడుకలు ఈ రోజు విజయనగరం టౌన్లోనూ, జిల్లాలోనూ గ్రాండ్ గా జరిగాయి. ఆయన వర్గం నాయకులు హాజరై బలాన్ని చాటుకున్నారు. ప్రత్యర్ధి వర్గంగా వున్న కోలగట్ల వీరభద్రస్వామి, బెల్లాల తదితరులు దూరంగా ఉన్నారు. రానున్న రోజులలో ఒకే పార్టీలో రాజకీయ వైరి వర్గాలు దూకుడుని ఎలా చూపుతాయనడానికి ఈ వేడుకలు ఓ ఉదాహరణ.


మరింత సమాచారం తెలుసుకోండి: